Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : వైరల్‌ అవుతున్న జూ. బండ్

By:  Tupaki Desk   |   5 Aug 2021 6:00 AM IST
పిక్ టాక్‌ : వైరల్‌ అవుతున్న జూ. బండ్
X
తెలుగు సినీ ప్రేక్షకులకు బండ్ల గణేష్‌ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన నటుడిగా కెరీర్‌ ను ప్రారంభించి నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించాడు. నిర్మాతగా ఆయన తక్కువ సమయంలోనే పవన్‌.. రామ్‌ చరణ్‌.. ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌... రవితేజ వంటి దిగ్గజ హీరోలతో సినిమాలను చేశాడు. భారీ సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్‌ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్‌ నిర్మాత అంటూ గుర్తింపు దక్కించుకున్నాడు. ఈమద్య కాలంలో నిర్మాతగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. త్వరలో పవన్‌ సినిమా తో నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఇటీవల బండ్ల గణేష్‌ హీరోగా పరిచయం కాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో స్పష్టత లేదు కాని బండ్ల గణేష్‌ తనయుడు హితేష్‌ నాగన్‌ బండ్ల మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు. తాజాగా బండ్ల గణేష్ తన కొడుకు ఫొటోను షేర్‌ చేశాడు. నా చిన్న కొడుకు అంటూ ఈ ఫొటోను షేర్‌ చేసిన బండ్ల గణేష్‌ ను ఏం సందేశం ఇస్తున్నారు అంటూ కొందరు కామెడీగా ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియాలో జూనియర్‌ బండ్ల ఫొటో తెగ వైరల్‌ అవుతోంది. నెట్టింట హితేష్‌ బండ్ల ఫొటో ను తెగ షేర్‌ చేస్తున్న నెటిజన్స్ కాబోయే హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కొడుకును హీరోగా చేస్తాను అంటూ ప్రకటించాడు. ఒక కొడుకు వ్యాపారాలు చూసుకుంటే ఒక కొడుకు సినిమాలు చేస్తాడు అన్నాడు. ఆ సినిమాలు చేసే కొడుకు ఇతడే అయ్యి ఉంటాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు హితేష్‌ అచ్చు నీలాగే ఉన్నాడు. కాస్త వెయిట్‌ ఎక్కువ ఉన్నాడు అన్నట్లుగా కామెడీ కామెంట్స్ పోస్ట్‌ చేస్తున్నారు. మొత్తానికి హితేష్‌ కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం వయసు చిన్నదే అవ్వడం వల్ల హీరోగా హితేష్‌ వచ్చేందుకు కాస్త సమయం పట్టవచ్చు.