Begin typing your search above and press return to search.
సిల్లీ శ్రీమంతుడి పాత్రలో బండ్ల గణేష్
By: Tupaki Desk | 23 April 2019 7:52 PM ISTకమెడియన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత నిర్మాతగా టర్న్ తీసుకున్న బండ్ల గణేష్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణంకు దూరం అయిన విషయం తెల్సిందే. నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఆయనకు నష్టాలనే మిగిల్చాయి. దాంతో బండ్ల గణేష్ నిర్మాణంకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నాడు. ఆయన గురించి మర్చి పోతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయ నాయకుడిగా కొన్ని రోజులు హడావుడి చేశాడు. ఈ రాజకీయాలు తనకు పడవని భావించిన బండ్ల గణేష్ మళ్లీ నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.
బండ్ల బాబు కమెడియన్ గా రీ ఎంట్రీ మహేష్ బాబు మూవీతో ఉండబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక చిత్రం రూపొందబోతుంది. ఆ చిత్రంలో బండ్ల గణేష్ కు ఒక పాత్ర దక్కినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బండ్ల గణేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఆయన కోసం దర్శకుడు అనీల్ పాత్రను డిజైన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సినిమాలో బండ్ల గణేష్ బాగా డబ్బున్న శ్రీమంతుడిగా - చాలా అమాయకపు వ్యక్తిగా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.
బండ్ల గణేష్ మామూలుగానే మంచి కామెడీ చేస్తాడు. అలాంటిది అనీల్ రావిపూడి సినిమాలో కామెడీకి పెద్ద పీట వేస్తాడు. అలాంటి సినిమాల్లో బండ్ల బాబుకు ఛాన్స్ రావడంతో మళ్లీ నటుడిగా, కమెడియన్ గా బండ్ల బాబు బిజీ అవ్వడం ఖాయం అంటూ టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు, అనీల్ రావిపూడిల కాంబో మూవీలో బండ్ల గణేష్ నటిస్తున్నాడా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు నిర్మాత అనీల్ సుంకర నుండి కాని, దర్శకుడి నుండి కాని ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మీడియాలో వస్తున్న వార్తలు ఏ మేరకు నిజమో చూడాలి.