Begin typing your search above and press return to search.

'పోసాని చావు ఎంతో భయంకరంగా ఉండబోతోంది'

By:  Tupaki Desk   |   1 Oct 2021 9:20 PM IST
పోసాని చావు ఎంతో భయంకరంగా ఉండబోతోంది
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు ఆయన కుటుంబ సభ్యుల మీద పోసాని కృష్ణ మురళి ఇటీవల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోసాని వ్యాఖ్యలపై పవన్ వీరాభిమాని, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. 'మా' ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పోసాని ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటివాడని.. ఆయన చావు భయంకరంగా ఉంటుందని అన్నారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ''పోసాని కృష్ణమురళి డేట్ అయిపోయిన తర్వాత బయట పడేయాల్సిన ఎక్స్ పైరీ ట్యాబ్లెట్ లాంటివాడు. ఫస్ట్ రోజు ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను విభేదించాడు. అది బాగానే ఉంది. ఆయన అభిప్రాయం చెప్పుకున్నాడు బాగానే ఉంది. రెండో రోజు ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టి 83 ఏళ్ల పవన్ కల్యాణ్ తల్లి గురించి అలా మాట్లాడటం తప్పు. ఆ తల్లి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఎంతమందికో అన్నం పెడుతున్నారు'' అని అన్నారు.

''మురళీగారి భార్య నాకు తల్లిలాంటిది. ఆమెకి పాదాభివందనం చేస్తా. కానీ తల్లులు భార్యా పిల్లలను తీసుకొచ్చి మాట్లాడటం సంస్కారం కాదు. మురళీ గారి గురించి మాట్లాడితే నా స్థాయి నేను తగ్గించుకున్నవాడిని అవుతా. ఆయన్ని భరిస్తున్న భార్యకు పాదాభివందనం. ఆయన మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పవన్ కల్యాణ్ గారి తల్లిని తిట్టడం వల్ల సభ్య సమాజం ఆయన్ను అసహ్యించుకుంటోంది. పవన్ కళ్యాణ్ మీద ఏదైనా ఉంటే తిట్టు కొట్టు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.. అంతేకానీ అంజనాదేవి గారిని, ఇతర ఆడవాళ్ల గురించి మాట్లాడటం ఎందుకు? భగవంతుడు అనేవాడు ఉంటే పోసాని కృష్ణ మురళి చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తారు. పోసాని ఒక ద్రోహి. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు.. ఎవరు అధికారంలో ఉంటే వారి సంక నాకుతాడు'' అని పోసాని పై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.