Begin typing your search above and press return to search.
వీడు పెద్ద ముదుర్రా అని వాళ్లు అనుకుంటారు
By: Tupaki Desk | 1 March 2017 5:33 PM ISTఅగ్ర హీరోలతో వరుస పెట్టి సినిమాలు తీసి టాలీవుడ్లో హాట్ టాపిక్ మారిన నిర్మాత బండ్ల గణేశ్. అంతేనా.. పెద్ద హీరోలతో వరుస పెట్టి సినిమాలు తీసిన ఆయన.. గణేశ్.. అంతేవేగంగా సినిమాలకు దూరంగా ఉన్న వైనం తెలిసిందే. కొద్దికాలంగా సినిమా ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని బండ్ల.. ఈమధ్యన ఇంటర్వ్యూలమీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఓపెన్ గా మాట్లాడటం.. అవసరమైన చోట మర్యాదను టన్నులు టన్నులు ప్రదర్శించటం తెలుసు. అంతలోనే.. తాను సైతం తక్కువోడినేమీ కాదన్న విషయాన్ని తన మాటలతో చెప్పేస్తుంటారు. ఇండస్ట్రీలో చిన్న చిన్న పనుల నుంచి మొదలైన అతడి ప్రస్థానం.. అగ్ర హీరోలతో భారీ సినిమాల్ని ఒకటి తర్వాత ఒకటి నిర్మించే స్థాయికి చేరుకున్న బండ్ల గణేష్ తన తాజా ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు.
పెద్ద హీరోలతో సినిమాలు చేసినా బండ్ల గణేష్ అంటే అ.. ఏదోలే అన్నట్లుగా.. చిన్న పిల్లాడ్ని చూసినట్లుగా చూస్తారు కదా చిత్ర పరిశ్రమలో.. అలా ఎందుకు చూస్తారు? బాధ అనిపించట్లేదా? అంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘భలే అడిగారు సార్. ఈ ప్రశ్న ఇప్పటివరకూ నన్నెవరూ అడగలేదు. నెంబర్ వన్ నేను చిన్న చిన్న వేషాలు వేయటం.. నెంబర్ టూ అందరితో చనువుగా ఉండటం. నన్ను చిన్న పిల్లాడిగా..గణేష్ గా చూసినా కానీ.. వారి మనసుకు తెలుసు. వీడేమైనా చేస్తాడ్రా.. వీడు పెద్ద ముదుర్రా అని వాళ్లకు తెలుసు. ఎదురుగా అనలేరు కదా. ఎదుగుదలను అంగీకరించటం కష్టం కదా సార్. రాధాగారి స్థాయి ఏందో మాకు తెలుసు. మీ సమకాలీనులు.. మీతో కలిసి 30 ఏళ్లు పని చేసినోళ్లు.. నేను తెలివైనోడ్ని.. ఆయన ఆంధ్రజ్యోతి ఓనర్ అయ్యాడు..మేం కాలేదనుకుంటారు. అలాంటోళ్లను పట్టించుకోవటం ఎందుకు. అలాంటోళ్లు కనిపించినప్పుడు.. అన్నా బాగున్నావా అంటే.. వాడి వరకూ వాడు హ్యాపీ. మనం పోయిన తర్వాత మనల్ని తిట్టుకుంటాడని నాకు తెలుసు. అర్థమైందా? మనం వెళ్లగానే మనల్ని తిట్టుకుంటాడు. వాడు మనల్నితిట్టుకుంటాడన్న విషయం నాకు తెలుసు’’
‘‘నేను లేనప్పుడు వాడు మనల్ని తిట్టుకోనీ.. నాకేం సంబంధం. వాడ్ని అన్నా అని అన్నామా.. మన పని మనం చేసుకున్నామా అంతే. వాడు నన్ను తిడుతున్నాడు.. వాడితో నేను గొడవ పెట్టుకొని కూర్చుంటూ.. పుణ్యకాలం కాస్తా ఇక్కడే అవగొట్టుకొని.. నా జీవితం ఏంది? నా ఫ్యూచర్ ఏంది? నా భార్యా పిల్లలేంది? అన్నట్లు నేనే ఆలోచిస్తానండి’’
‘‘మనల్నితిట్టుకునేవాళ్లు తిట్టుకోవాలి సార్. మనల్ని తిట్టుకోలేకపోతే మనం ఎక్కడ ఎదుగుతాం సార్. మనకి ఎంతమంది శత్రువులు ఉంటే.. అంత మంచిది సార్. దారిన పోయే వాడికి శత్రువులు ఎవరుంటారు సార్. మన దగ్గర విషయం ఉంటే..మనల్నితట్టుకోవటానికి.. ఆడేం ఉందిలే అంటారు. ‘ఆడేం ఉందిలే’ అనాలనే నేను కోరుకుంటా. 200 మంది నిర్మాతలు ఉన్నారు. రెగ్యులర్ గా సినిమాలు తీసే వాళ్లు 20 మంది ఉన్నారు. నెంబర్ వన్ హీరోలతో సినిమాలు తీసే వాళ్లు పది మంది ఉన్నారు. ఆ పది మంది మీదా.. 200 మంది ఏడుస్తారు కదా సార్. వాడూ నిర్మాతేగా. వాళ్లకి డేట్స్ ఇస్తే సినిమాలు తీస్తారు. హీరో డేట్లు తెచ్చుకోవటం ఒక కళ సార్. ఏదో సినిమా తీస్తే.. అందరిని బతమాలాడాలి. అదే పెద్ద హీరోతో పని చేస్తే.. ఆ హీరోను బతిమిలాడితే చాలు.. మిగిలినోళ్లంతా మనల్ని బ్రతిమిలాడుతుంటారు.నా పాలసీ అది సార్’’ అని చెప్పుకొచ్చాడు. తానెంత బతకనేర్చినోడన్న విషయాన్ని గణేష్ ఎంత బాగా చెప్పాడో కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/