Begin typing your search above and press return to search.

ఆ థియేటర్ ఎక్కడుంది బండ్ల?

By:  Tupaki Desk   |   4 Sept 2015 4:24 PM IST
ఆ థియేటర్ ఎక్కడుంది బండ్ల?
X
బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో చెప్పడానికి మాటలు చాలవు. అసలు అభిమానం అన్నా కూడా ఒప్పుకోడేమో ఈ మెగా ప్రొడ్యూసర్. భక్తి అంటేనే కరెక్ట్ అనుకుంటా. పవన్ బర్త్ డే రోజున... నా దైవం అంటూ రకారకాల కొటేషన్స్, కాప్షన్స్ తో బండ్ల గణేష్ చెప్పిన విషెస్... అబ్బురపరిచాయి. అయితే... అభిమానం ఉండడం సహజమే.. కానీ అందుకోసం కొన్నిసార్లు అబద్ధాలు ప్రచారం చేసేందుకు కూడా వెనుకాడ్డం లేదు ఈ ప్రొడ్యూసర్.

ప్రస్తుతం ఓ సినిమా మూడోవారం అంటే పెద్ద రికార్డ్ గా మారిపోయిన టైంలో... బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ ఒక థియేటర్ లో 525రోజులు పూర్తి చేసుకుంది. నిజంగా ఇది ప్రశంసించదగ్గ విషయమే. కానీ... బండ్ల గణేష్ కి మాత్రం ఈ రికార్డ్ నచ్చలేదు. అందుకే తను పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ దే అతి పెద్ద రికార్డ్ అని... ఒకే థియేటర్ లో 1,210వ రోజు ప్రదర్శితమవుతోందనీ ట్వీటేశాడు. బాగానే ఇంత పెద్ద రికార్డ్ సృష్టిస్తే అది గొప్ప విషయమే.

కానీ ఆ సినిమా ఏ థియేటర్ లో ఆడింది.. ఆ ధియేటర్‌ ఎక్కడుంది లాంటి విషయాలు కూడా చెప్పాలి కదా. కానీ అలాంటిదేమీ చేయలేదు బండ్ల. బహుశా ఆయన సొంతింట్లోని హోం థియేటర్ లో ఇన్ని రోజులు ప్రదర్శిస్తూ ఉండి ఉంటారు అని జోక్స్ వేసుకుంటున్నారు జనాలు. పవన్ ఏమాత్రం పట్టించుకోని రికార్డుల కోసం.. ఇలా బండ్ల గణేష్ ట్విట్టర్ ఎక్కి ట్వీటడం చూస్తుంటే... భక్తి బోర్డర్లు దాటిపోయిందనిపిస్తోంది.