Begin typing your search above and press return to search.
కమెడియన్.. ఎన్నికల తర్వాత హయ్యెస్ట్ ఫీజు!
By: Tupaki Desk | 5 Aug 2019 7:37 PM ISTబండ్ల గణేష్ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. కమెడియన్ గా... నిర్మాతగా అయన పాపులారిటీ ఒకప్పుడు పీక్స్ లో ఉండేది.. ఇక టీవీ ఛానెల్స్ లో చర్చలకు వస్తే రచ్చరంబోలానే. ఒక్క ఇంటర్వ్యూ ఇస్తే చాలు.. యూట్యూబ్ ఛానెల్స్ వారికి కనీసం పది ఇరవై థంబ్ నెయిల్స్ దొరికినట్టే. అయితే ఎన్టీఆర్ 'టెంపర్' సినిమా తర్వాత మరో సినిమాను నిర్మించలేదు.. నటించలేదు. 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. అయితే బండ్ల గణేష్ కు పెద్దగా ఉపయోగం లేకపోవడంతో అతి తక్కువ సమయంలో రాజకీయాలకు రామ్ రామ్ చెప్పాడు.
ఇదంతా పక్కన పెడితే కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' లో కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే బండ్ల రీ ఎంట్రీకి సంబంధించిన మరో విషయం షాక్ ఇస్తోంది. మహేష్ సినిమాకోసం నిర్మాతలు బండ్ల గణేష్ కు రోజుకు 5 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇది టాలీవుడ్ లో ఓ కమెడియన్ కు హయ్యెస్ట్ రెమ్యూనరేషన్. గతంలో బ్రహ్మానందం ఒక రోజుకు 2-3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఒకవేళ ఫుల్ లెంగ్త్ రోల్ అయితే సినిమాకు పాతిక లక్షలు తీసుకునేవారట. ఇప్పుడు బండ్ల తన రెమ్యూనరేషన్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు.
అయితే ఇంత ఫీజు ఇచ్చేందుకు రెడీ అయ్యారంటే బండ్ల గణేష్ కు అనిల్ రావిపూడి ఒక కీలకమైన పాత్ర ఇచ్చి ఉంటాడని.. 'వాడకం' అంటే ఏంటో రావిపూడి చూపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ట్రైన్ జర్నీలో బండ్ల బాబు అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి ఆల్రెడీ రెడీ అయ్యాడు. సోమవారమే అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న సరిలేరు షూటింగ్ లో జాయిన్ అయ్యాడట.