Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరికీ కలుపుతున్న పవన్ భక్తుడు...?

By:  Tupaki Desk   |   3 Jan 2022 8:00 AM IST
ఆ ఇద్దరికీ కలుపుతున్న పవన్ భక్తుడు...?
X
ఆయనకు ఎన్ని ఉన్నా కూడా ఆ ట్యాగ్ అంటేనే ఇష్టం. అదే పవన్ భక్తుడు అని. ఆయనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. తొంబై దశకంలో హీరో చుట్టూ తిరిగే మిత్ర బృందంలో బండ్ల గణేష్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అమాయకమైన ఫేస్ తో బండ్ల పండించే కామెడీకి నాటి ఆడియన్స్ ఫిదా అయ్యేవారు. ఆ తరువాత చూస్తూండగానే బండ్ల ఎదిగారు. ఆయన స్టార్ ప్రొడ్యూసర్ రేంజిని చూశారు.

పవర్ స్టార్ తో ఆయన తీసిన గబ్బర్ సింగ్ టాలీవుడ్ లో రికార్డులను వేటాడింది. ఆ మూవీ ఈ రోజుకీ ఏ రోజుకీ కూడా హాట్ ఫేవరేటే. ఆ ఫ్లావర్ కూడా ఎపుడూ వాడిపోదు, ఎపుడైనా ఫ్రెష్ నెస్ తగ్గదు. ఇదిలా ఉంటే బండ్ల మళ్ళీ పవర్ స్టార్ తో సినిమా తీయాలని చూస్తున్నారు. ఈ వార్త కూడా నలిగి నలిగి పాతబడిపోయింది.

ఎపుడో 2011లో గబ్బర్ సింగ్ వస్తే మళ్లీ భక్తుడికి పవన్ కరుణించలేదు అని సరదాగా చెప్పుకుంటారు. నా దేవుడు ఓకే అంటే ఆయనతోనే సినిమా తీస్తా అంటూ బండ్ల తరచూ చెబుతూ వచ్చారు. అయితే ఇన్నాళ్ళకు పవన్ తో బండ్ల సినిమా కన్ ఫర్మ్ అయింది అన్న టాక్ అయితే నడుస్తోంది.

ఈ మూవీని గ్రాండియర్ గా పాన్ ఇండియా రేంజి లో తీయాలని బండ్ల డిసైడ్ అయ్యాడని టాక్. ఈ మూవీకి పూరీ జగన్నాధ్ డైరెక్టర్ అని ఫిక్స్ చేసుకున్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. పూరీ విషయం తీసుకుంటే ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం పవన్ తోనే ఫస్ట్ సినిమా డైరెక్షన్ చాన్స్ కొట్టారు. బద్రీ తీస్తే బంపర్ హిట్ అయింది.

ఆ తరువాత ఈ ఇద్దరూ కలసి చేసిన కెమెరా మాన్ గంగతో రాంబాబు మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా పూర్తి తృపి ఇవ్వలేదనే చెప్పాలి. దాంతో ముచ్చటగా మూడవ సినిమా పవన్ తో పూరీ ప్లాన్ చేస్తున్నాడు. అది బండ్ల బ్యానర్ మీదనే ఉంటుంది అంటున్నారు. దీంతో ఈ ఇద్దరినీ కలిపేది బండ్లేనా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారుట. మరి ఈ మూవీ ఈ ఏడాది ఎండింగ్ లో సెట్స్ మీదకు వస్తుందా లేక నెక్స్ట్ ఇయర్ షూటింగ్ ఉంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా బండ్ల, పూరీ, పవన్ ఈ కాంబో తోనే పూనకాలు వచ్చేట్టున్నాయి కదా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి.