Begin typing your search above and press return to search.

కరోనా అని తెలియగానే భయమేసింది: బండ్ల

By:  Tupaki Desk   |   20 July 2020 9:00 PM IST
కరోనా అని తెలియగానే భయమేసింది: బండ్ల
X
కరోనా తనకు సోకిందని చాలా భయమేసిందని.. నన్ను కరోనా నుంచి బయట పడేయమని ఆ భగవంతుడిని వేడుకున్నానని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. కరోనాపై టీవీల్లో ప్రసారమయ్యే కథనాలు చూసి మరింత ఆందోళన చెందానని తెలిపారు.

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకోవడానికి వెళితే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కరోనా అని తెలిసిందని బండ్ల గణేష్ తెలిపారు. 14 రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంటిపైన గదిలో హోం క్వారంటైన్ లో ఉన్నానని.. జయించానని బండ్ల తెలిపారు.

డాక్టర్ల సలహా మేరకు ఇంట్లోనే క్వారంటైన్ ఉండి ఉదయం, సాయంత్రం గుడ్డు తినేవాణ్ని అని.. వేడి నీటిని పుక్కిలించడం.. ఆవిరి పట్టడం.. బ్రీథింగ్ వ్యాయామాలు చేసేవాడనని బండ్ల తెలిపారు. విటమిన్ ట్యాబెట్స్ వేసుకోవడం.. మెడిటేషన్ చేసుకుంటూ 14 రోజులు గది నుంచి బయటకురాలేదని వివరించాడు.మా ఫ్యామిలీ నా వద్దకు రాకున్నా నా అవసరాలన్నీ తీర్చారని తెలిపారు.

కరోనా సోకాక ఎంతో బాధపడ్డానని.. బతికినంత కాలం గొడవలు.. వివాదాలు లేకుండా మంచిగా బతకాలన్నదే ముఖ్యం అని డిసైడ్ అయ్యానని బండ్ల తెలిపారు. కరోనాను జయించిన తాను మరొకరి ప్రాణాలు నిలబడతాయంటే ప్లాస్మా దానం ఇస్తానని బండ్ల తెలిపారు.

ఇక కరోనా పోయాక ప్రజలు ఆటోమేటిక్ గా థియేటర్ల వైపు వస్తారని.. సినిమా రంగానికి మళ్లీ మామూలు రోజులు తప్పక వస్తాయని బండ్ల తెలిపారు.