Begin typing your search above and press return to search.

బండ్ల‌ను గెలిపిస్తే 100 ఇళ్లు క‌ట్టిస్తాడ‌ట‌!

By:  Tupaki Desk   |   28 Sep 2021 6:32 AM GMT
బండ్ల‌ను గెలిపిస్తే 100 ఇళ్లు క‌ట్టిస్తాడ‌ట‌!
X
మాట‌లు కోట‌లు దాటుతున్నాయి. ప్రామిస్ లు అనంత విశ్వాన్ని తాకుతున్నాయి. కానీ ఇవ‌న్నీ ఫ‌లిస్తాయా ఏమో కానీ.. మూవీ ఆర్టిస్టుల ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల మనోగ‌తం ఎవ‌రికీ బోధ ప‌డ‌డం లేదు. ఎవ‌రికి వారు రియ‌ల్ రాజ‌కీయ నాయ‌కుల‌నే త‌ల‌పిస్తూ కోట‌లు క‌ట్టేస్తున్నారు. మాట‌ల‌తోనే భ‌వంతులు నిర్మించేయ‌డం ఎలానో చూపిస్తున్నారు. ఇంత‌కుముందు ప్ర‌కాష్ రాజ్.. విష్ణు ప్ర‌క‌ట‌న‌లు ఇదే తీరుగా సాగ‌గా.. ఇప్పుడు బండ్ల వంతు.

నన్ను గెలిపిస్తే కెసిఆర్ తో మాట్లాడి 100 ఇళ్ళు కట్టిస్తానని కేవ‌లం జూబ్లీహిల్స్ లో మా భ‌వంతి నిర్మిస్తే స‌రిపోద‌ని పేద ఆర్టిస్టుల‌కు ఇండ్లు నిర్మించాల‌ని బండ్లగణేష్ బ‌లంగా కోరారు. తాను నిర్మించి ఇస్తాన‌ని ప్రామిస్ చేస్తున్నారు. మా ఎన్నిక‌ల్లో జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ విసురుతున్న పంచ్ లు చ‌లోక్తులు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. నేడు త‌న‌ పదవికి నామినేషన్ వేసిన అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. త‌న‌కు మా మెంబ‌ర్ల నుంచి సంపూర్ణ మ‌ద్ధ‌తు ఉంద‌ని ప‌ర‌మేశుని మ‌ద్ధ‌తు ఉంద‌ని ప్ర‌క‌టించిన బండ్ల వ‌రుస పంక్తుల‌తో వేడెక్కించారు. నేను గెలవడం పక్కా .. ఇంతకు ముందు గెలిచినా వాళ్ళు ఏమి చేయలేదని అన్నారు. అడిగితే కరోనా ఉందని తప్పించుకుంటున్నారు.. అని బండ్ల అన్నారు.

మా భ‌వంతిని జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతంలో ఇంద్రభవనం కడతామంటే కుదరదు. దాంతో పాటు 100మంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు కూడా కట్టించాలి. సీఎం కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి మహా ప్రభో మాకు స్థలం ఇప్పించండి.. మా డబ్బులతో పేద కళాకారులకు ఇళ్లు కట్టిస్తాం.. అని అభ్య‌ర్థిస్తాన‌ని ఆయ‌న కాద‌న‌ర‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు బండ్ల‌.

పేద కళాకారులకు ఇళ్ళు కట్టడానికి కెసిఆర్ ని స్థలం ఇమ్మని అడుగుతానని.. బండ్ల తెలిపారు. మన హీరోలు ఒక్కొక్కరు వజ్రాల్లాంటి వాళ్ళు.. వారు దయతలిచి సహాయం చేస్తే 100 మంది పేద కళాకారులకి ఆ స్థలంలో ఇళ్ళు కట్టిస్తాను.. అని బండ్ల మీడియా ముందు ప్ర‌క‌టించారు. చూస్తుంటే మాట‌లు కోట‌లు దాటుతున్న‌ట్టే అనిపిస్తున్నా కొంతైనా బండ్ల ఒక్క‌డే నిజాయితీగా ఆలోచిస్తున్నాడా? అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయ్ అంటూ రివ‌ర్స్ పంచ్ లు ప‌డుతున్నాయి ఆర్టిస్టుల్లో.