Begin typing your search above and press return to search.

అడల్ట్ సినిమాల్లో యాక్టింగ్ పై బండ్లన్న క్లారిటీ

By:  Tupaki Desk   |   3 Jan 2023 7:30 AM GMT
అడల్ట్ సినిమాల్లో యాక్టింగ్ పై బండ్లన్న క్లారిటీ
X
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మొదట సినిమా ప్రపంచంలో చిన్న నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక సైడ్ క్యారెక్టర్ కమెడియన్ నుంచి అతను కొన్నిసార్లు మెయిన్ కమెడియన్ గా చేసే వరకు వచ్చాడు. ఎలాంటి సినిమా చేసిన కూడా బండ్ల గణేష్ తనదైన డిఫరెంట్ స్టైల్ తో ఆకట్టుకునేవాడు. ఇక ఇప్పుడు నిర్మాతగా మారిన తర్వాత నటుడిగా ఎలాంటి సినిమాలు చేయడం లేదు.

చివరగా ఆ మధ్యలో డేగల బాబ్జి అని సినిమాలో లీడ్ పాత్రలో నటించాడు. అయితే సినిమా కెరిర్ మొదట్లో బండ్ల గణేష్ కొన్ని అడల్ట్ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇక ఆ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

నిజానికి అలాంటి సినిమాల్లో తాను నటించాలని అనుకోలేదు అని నిర్మాత నట్టి కుమార్ ఒక సినిమాలో హీరో పాత్ర అని చెప్పగానే చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలియజేశాడు.

అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదు అని ఏదో నార్మల్ సినిమా అనుకుంటే ఆ తర్వాత ఊహించిన విధంగా అలాంటి సన్నివేశాలు నటించాల్సి వచ్చింది అని చెప్పాడు.

ఇక నిర్మాత ఏదో పైకి కిందకి అంటే సరిపోతుంది అని ఏదో మాట్లాడి ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయించాడు అని ముందే తెలిసి ఉంటే అలాంటి సినిమా చేయకపోయేవాడిని అని బండ్ల గణేష్ తెలిపాడు.

అంతే కాకుండా అప్పట్లో హీరో అంటే ముందుగా పెద్దగా కథలు ఎవరు చెప్పేవారు కాదు. నాలాంటి చిన్న స్థాయి నటుడికి ఒక ఆఫర్ ఇస్తే సైలెంట్ గా వెళ్లి షూటింగ్లో పాల్గొనే రోజులు అవి. ఆ విధంగా నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది. మళ్ళీ ఆ విధంగా రిపీట్ కాకుండా చూసుకున్నట్లుగా.. గణేష్ తెలియజేశాడు. ఇక బండ్ల గణేష్ నిర్మాతగా రాబోయే రోజుల్లో మళ్ళీ బిజీ అవుతానని చెబుతున్నాడు. చివరిగా ఈ నిర్మాత నుంచి టెంపర్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.