Begin typing your search above and press return to search.

'పవర్ స్టార్' పోస్టర్ లైక్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బండ్ల గణేష్...!

By:  Tupaki Desk   |   25 July 2020 2:40 PM IST
పవర్ స్టార్ పోస్టర్ లైక్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బండ్ల గణేష్...!
X
పవన్ కళ్యాణ్ కి నటుడు నిర్మాత బండ్ల గణేష్ వీరాభిమాని అనే విషయం అందరికి తెలిసిందే. నేను అభిమానిని కాదు భక్తుడిని అని చెప్పుకుంటాడు బండ్ల గణేష్. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తీసిన ''పవర్ స్టార్'' సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ని లైక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి కాదని వర్మ చెప్తున్నప్పటికీ ఇది ముమ్మాటికీ పవన్ కళ్యాణ్ పై తెరకెక్కిన సినిమా అని అందరికి తెలుసు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని పోలిన పాత్రతో పాటు మెగాస్టార్ చిరంజీవి - నారా చంద్రబాబు నాయుడు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - బండ్ల గణేష్ ని పోలిన పాత్రలను కూడా క్రియేట్ చేశారు ఆర్జీవీ. ఈ రోజు విడుదలైన 'పవర్ స్టార్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మ ఈ చిత్రంలోని పవన్ - చిరుని పోలిన వ్యక్తులు ఉన్న ఫొటో ట్విట్టర్ లో షేర్ చేసిన వర్మ ''వాళ్లిద్దరూ అన్నదమ్ముల్లా?'' అని ట్వీట్ చేశారు. దీనికి బండ్ల గణేష్ లైక్ కొట్టాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్ ని ప్రశ్నిస్తున్నారు.

కాగా నిన్న షాద్ నగర్ దగ్గర బైక్ మీద నుండి పడిన వ్యక్తికి సాయం చేసిన బండ్ల గణేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ''అందంతా కాదు బండ్లన్న ఇది ఎందుకు లైక్ చేసినావ్? అంటూ బండ్ల గణేష్ లైక్ చేసిన స్క్రీన్ షాట్ షేర్ చేసాడు. అయితే వెంటనే దీనిపై రియాక్ట్ అయిన బండ్ల గణేష్ ''ప్రామిస్.. ఇది పొరపాటున జరిగింది. నేను ఎప్పుడూ ఇలా చేయను. నా తప్పుకు క్షమించండి'' అని ట్వీట్ చేసి ఎక్సప్లనేషన్ ఇచ్చుకున్నాడు. అయితే నెటిజన్స్ మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలియక చేసిన పొరపాటు అయితే అక్కడ అన్ లైక్ ఆప్షన్ కూడా ఉందిగా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం 'ఆయనకి ట్విట్టర్ యూస్ చేయడం రాదు. కానీ అతను జెన్యూన్ పర్సన్' అని వెనకేసుకొస్తున్నారు. ఈ ట్వీట్స్ కి కామెంట్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ మీద కోపంగా ఉన్నట్లు అర్థం అవుతోంది.