Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: బండ్ల `రౌద్రం ర‌ణం రుధిరం` థ్రిల్ల‌ర్

By:  Tupaki Desk   |   8 Nov 2021 5:30 AM GMT
ట్రైల‌ర్ టాక్: బండ్ల `రౌద్రం ర‌ణం రుధిరం` థ్రిల్ల‌ర్
X
క‌మెడియ‌న్ గా టాలీవుడ్ లో సుదీర్ఘ కెరీర్ ని సాగించిన బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల‌ రాజ‌కీయ నాయ‌కుడిగా మారాక‌ ప‌బ్లిసిటీ స్టంట్ గురించి తెలిసిందే. మీడియా టీఆర్పీల‌కు ఆచేత‌నంగా అల‌వోక‌గా స‌హ‌క‌రించే బండ్ల గ‌ణేష్ అభిన‌యం ఆంగికం వాచ‌కం ఇప్పుడు మ‌రో లెవ‌ల్లో వ‌ర్క‌వుటైన‌ట్టే క‌నిపిస్తోంది.

అత‌డు సోలో పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం `డేగ‌ల బాబ్జీ` త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో అన్ని పాత్ర‌లు బండ్ల‌నే పోషించ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర‌ ట్విస్టు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంలో ఆత్మ‌ల్ని ప్ర‌వేశ‌పెట్టి థ్రిల్ల‌ర్ మోడ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని తాజాగా రిలీజైన ట్రైల‌ర్ చెబుతోంది. మాన‌సిక వైక‌ల్యంతో బాధ‌ప‌డే వాడిగా ఆత్మ‌ల‌తో మాట్లాడుతున్న వాడిగా త‌న‌లో తానే కుమిలిపోతూ భ‌య‌ప‌డుతూ భ‌య‌ప‌డుతూ దుఃఖిస్తూ అత‌డు ప్ర‌ద‌ర్శించే అభిన‌యం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది.

ఈ చిత్రానికి వెంక‌ట్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ర్డ‌ర్ కేస్ తాలూకా అనుమానితుడిగా బండ్ల గ‌ణేష్ అలియాస్ డేగ‌ల బాబ్జీ పోలీస్ స్టేష‌న్ లో ప్ర‌వేశించాక ఏం జ‌రిగింద‌నేది తెర‌పైనే చూడాలి. అస‌లు ఎందుకు హ‌త్య చేశావ్? అంటే.. వాడు ఉంచుకున్న దానికోసం బ‌య‌ల్దేరాడు.. అంటూ అప్స‌ర లాడ్జీ..వ‌ద్ద ఏం జ‌రిగిందో చెబుతాడు బండ్ల‌. ఆ త‌ర్వాత ట్విస్టులే ట్విస్టులు. 50 దెయ్యాలు న‌న్నే చూస్తున్నాయ్ భ‌య‌పెడుతున్నాయ్! అంటూ ఒణికిపోయే బండ్ల న‌ట‌న ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

ఎందుకు బావా? అంటూ బండ్ల వెంట‌ప‌డే ఆడ దెయ్యం క‌థేమిటో బాబ్జీ బాబ్జీ అంటూ ఏడ్చే మ‌రో దెయ్యం క‌థేంటో కూడా తెర‌పైనే చూడాలి. ఇక ఇందులోనే మ‌ద‌ర్ సెంటిమెంట్ ని కూడా చూపించారు. మొత్తానికి డేగ‌ల బాబ్జీ ట్రైల‌ర్ ఆద్యంతం స‌స్పెన్స్ థ్రిల్స్ తో క‌ట్టి ప‌డేసింది. ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ఈ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. అయితే సినిమా చూస్తున్నంత సేపూ న‌స ఫీలింగ్ క‌ల‌గ‌కుండా యంగేజింగ్ గా చూపించ‌గ‌లిగితే బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే. బండ్ల గ‌ణేష్ కాస్తా బ్లాక్ బ‌స్ట‌ర్ బాద్ షాగా నిలదొక్కుకునే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి మ‌రో ప‌ది సినిమాల‌కు అత‌డు హీరో అయ్యే ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్టే. మ‌రి ఏం జ‌రుగుతోందో కాల‌మే స‌మాధానం చెప్పాలి. య‌శ‌ష్ రిషీ ఫిలింస్ ప‌తాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మిళ చిత్రం ఒత్త సెరుప్పు సైజ్ 7 స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని తెలుస్తోంది.