Begin typing your search above and press return to search.

బానిసను కాదు.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   1 May 2020 6:30 PM IST
బానిసను కాదు.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
X
రాంగోపాల్ వర్మ లాగానే మన బండ్ల గణేష్ సైతం ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు.. ఎన్నికల వేళ కేసీఆర్ ను తెగ తిట్టి ఇప్పుడు దైవాంస సంభూతుడు అంటూ కొనియాడడం ఆయనకే చెల్లింది. రాజకీయాల్లోకి ప్రవేశించి అనక కాడి వదిలేసి ప్రస్తుతం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా బండ్ల గణేష్ కొలుస్తాడు. పవన్ కు భక్తుడిగా మారిపోయాడు.

ఈ మధ్య లాక్ డౌన్ లో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ఆయన దేవుడు అంటూ వేయినోళ్ల ట్విట్టర్ లో పొగిడేస్తున్న బండ్ల గణేష్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పడ్డారు. కేసీఆర్ ను దేవుడు అంటూ కొనియాడారు.

ఈ వ్యాఖ్యలతో బండ్ల గణేష్ ను సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఆయనపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన బండ్ల గణేష్ తాజాగా ట్వీట్ పెట్టారు.. ‘నాపై వచ్చిన విమర్శలు నేను ఎప్పుడు చదవనని.. ఎందుకంటే అవి నేనంటే నచ్చనివారి కోసం రాసినివి. నేనేంటో నాకు తెలుసు. నా అభిప్రాయాన్ని రాస్తూ ఉంటా.. నేను ఎవరికి బానసను కాదు’ అంటూ ట్వీట్ చేసి నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు బండ్ల.

ఇలా తన ట్వీట్లు, పర్యవసనాలతో హట్ అయిన బండ్ల గణేష్ తాను బానిసను కాదంటూ డైలాగ్ పేల్చడం హాట్ టాపిక్ గా మారింది.