Begin typing your search above and press return to search.
బండ్ల గణేష్ రాజకీయాలకు సెలవు.. పెట్టినట్లేనా?
By: Tupaki Desk | 11 May 2020 11:00 PM ISTటాలీవుడ్ లో 'గబ్బర్ సింగ్' సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు కమెడియన్ కం పొలిటిషన్ బండ్ల గణేష్. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ సినిమా నిర్మించి గణేష్ గబ్బర్ సింగ్ సినిమాతో కాసుల పండగ చేసుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలతో, ఎన్టీఆర్ హీరోగా బాద్షా, టెంపర్ సినిమాలు నిర్మించి టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. అనంతరం నీ జతగా నేనుండాలి సినిమాతో ప్లాప్ అందుకున్నాడు.
ఆ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన గణేష్.. గతేడాది ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇక తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై.. "నాకు కిక్ ఇచ్చేది రాజకీయాలు కాదు.. సినిమాలే అని తెలుసుకున్నా. అందుకే ఇకపై సినిమాలతోనే కిక్ పొందాలని డిసైడ్ అయ్యానని తెలిపాడు. ఆయన నిర్మించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం నేటితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో.. ఫ్యాన్స్ అంతా 8ఇయర్స్‌ఆఫ్‌గబ్బర్‌సింగ్‌హిస్టీరియా అనే ట్యాగ్‌తో రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తమ హీరోకి ఇలాంటి గొప్ప హిట్ చిత్రం ఇచ్చిన బండ్ల గణేష్‌ని కూడా వారు ట్యాగ్ చేస్తున్నారు.
ఈ ఉత్సాహంతో బండ్ల గణేష్ రాత్రి నుంచి ఈ హిస్టీరియాలో మునిగిపోయారు. ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాకే అతుక్కుపోయిన ఆయన రీట్వీట్స్ చేస్తూ.. మధ్యమధ్యలో గబ్బర్‌సింగ్ చిత్రం, పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంత పిచ్చో చెప్పే ప్రయత్నం చేసాడు. తాజాగా గణేష్ చేసిన 'రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు' అనే ట్వీట్.. ఆయన రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాడేమో అన్పిస్తుంది. ఇంకా ట్వీట్స్ చేస్తూ.. ‘‘జీవితంలో కిక్ కావాలంటే ఒక్క సినిమానే.. అని నేను డిసైడ్ అయ్యా. నాకు సినిమానే జీవితం సినిమాయే ప్రాణం. నా 15 సంవత్సరాల వయస్సులో సినిమా ఇండస్ట్రీకి వచ్చా. నాకు రాజకీయాలు వద్దు సినిమాయే ముద్దు. నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరాడు’’ ప్రస్తుతం గణేష్ ట్వీట్లు సోషల్ మీడియాలో సినీవర్గాలలో హాట్ టాపిక్ అయ్యాయి.