Begin typing your search above and press return to search.

వకీల్ సాబ్‌ చివరి రోజు షూట్‌ లో బండ్ల

By:  Tupaki Desk   |   30 Dec 2020 11:00 AM IST
వకీల్ సాబ్‌ చివరి రోజు షూట్‌ లో బండ్ల
X
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వకీల్ సాబ్‌ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టేశారు. వచ్చే నెల రెండవ వారం వరకు కొనసాగే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. కాని 2020 సంవత్సరంలోనే వకీల్ సాబ్‌ కు గుమ్మడి కాయ కొట్టేయడం జరిగింది. కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలనుకున్న ఈ సినిమా అనేక కారణాల వల్ల దాదాపుగా ఏడాదిన్నర వరకు అయ్యింది. ముఖ్యంగా కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌ కు రీమేక్ గా రూపొందిన వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్ ముగింపు సందర్బంగా నిర్మాతలు బండ్ల గణేష్‌ మరియు ఏఎం రత్నంలు ఇంకా కొందరు ప్రముఖులు హాజరు అయ్యారు.

ఈ సందర్బంగా బండ్ల గణేష్ వకీల్ సాబ్ సెట్ లో తీసుకున్న కొన్ని ఫొటోలను షేర్‌ చేశాడు. ఏఎం రత్నం తో తన ఫొటోను షేర్‌ చేసి నేను మరియు ఏఎం రత్నం గారు మా బాస్ షూటింగ్‌ లో.. జై పవర్‌ స్టార్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. స్నేహితుడు అన్న అంటూ నర్ర శ్రీనివాస్‌ తో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. గత కొన్ని రోజులుగా పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా కోసం బండ్ల గణేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు సందర్బంగా ఇలా సెట్‌ లో మరోసారి పవన్‌ కళ్యాణ్‌ ను కలిసేందుకు బండ్ల ప్రయత్నించాడు.