Begin typing your search above and press return to search.

హీరోగా బండ్ల .. పారితోషికం ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   22 Aug 2021 6:00 AM IST
హీరోగా బండ్ల .. పారితోషికం ఎంతో తెలుసా?
X
నిర్మాత కం న‌టుడు బండ్ల గ‌ణేష్ హీరోగా ఓ సినిమాకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని వెంక‌ట్ చంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నాడు. బండ్ల‌ గ‌ణేష్ హీరోగా స్వీయద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాల‌న్న‌ది అత‌ని ఆలోచ‌న‌. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ఇచ్చి గ‌ణేష్ కి హీరోగా మంచి పేరు తీసుకురావాల‌ని యువ ద‌ర్శ‌కుడు కంక‌ణం క‌ట్టుకుని ప‌ని చేస్తున్నాడట‌. మ‌రి ఈ చిత్రానికి బండ్ల గ‌ణేష్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు? అంటే ఆస‌క్తిక‌ర సంగ‌తే తెలిసింది. అత‌డు అక్ష‌రాలా 25 ల‌క్ష‌ల రూపాయలు అందుకుంటున్నారు.

ఈ ఆఫ‌ర్ ని బండ్ల ముందు స‌ద‌రు ద‌ర్శ‌క‌ నిర్మాత ఉంచ‌డంతో మ‌రో మాట లేకుండా గ‌ణేష్ ఒకే చేసిన‌ట్లు స‌మాచారం. ఇది ప‌రిమిత బడ్జెట్ చిత్రం. భారీ ఖ‌ర్చుతో కాకుండా త‌క్కువ బ‌డ్జెట్ లోనే చిత్రాన్ని పూర్తి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. న‌టీన‌టులంతా తెలుగు వారినే ఎంపిక చేసుకుని అవ‌స‌రం మేర పేరున్న తార‌ల‌ను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక గ‌ణేష్ కి హీరోగా తొలి సినిమా ఇదే . గ‌తంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా.. కమెడియ‌న్ గా చాలా సినిమాల్లో న‌టించారు. న‌టుడిగా ఆయ‌న కెరీర్ క‌మెడియ‌న్ గానే ప్రారంభ‌మైంది. అటుపై అవ‌కాశాలు పాత్ర‌ల‌ను బ‌ట్టి ఆహార్యాన్ని మార్చుకున్నారు.

ఆ త‌ర్వాత కాలంలో నిర్మాత‌గా అవ‌తారం ఎత్తారు. నిర్మాత‌గా గ‌ణేష్ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ లో అగ్ర హీరోలంద‌రితో సినిమాలు నిర్మించారు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నారు. అటుపై రాజ‌కీయాల్లోనూ ఆయ‌న స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేసారు. కానీ రాజ‌కీయాల్లో అంత‌గా రాణించ‌లేక‌పోయారు. అనంత‌రం మ‌ళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ అయ్యారు. నిర్మాత పారిశ్రామికవేత్త‌ పీవీపీ .. మాణిక్ చంద్ పాన్ మ‌సాలా స‌చిన్ తోనూ బండ్ల స్నేహం గురించి తెలిసినదే.