Begin typing your search above and press return to search.
హీరోగా బండ్ల గణేష్..?
By: Tupaki Desk | 8 July 2021 9:00 AM ISTనటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన వ్యవహార శైలితో.. మనసుకు ఏది తోస్తే అది మాట్లాడుతూ విమర్శలకు గురవుతూ వార్తల్లో నిలుస్తుంటారు. సినిమా ఫంక్షన్ లో ఆయన స్పీచ్ లకు చాలామంది అభిమానులు ఉంటారు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్.. ప్రొడ్యూసర్ గా మారి ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్ కి ఎదిగాడు. నటనకు ఎప్పుడో దూరమైన గణేష్.. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో బ్లేడు గణేష్ అనే చిన్న పాత్రలో నటించాడు. అయితే ఈ రోల్ పై నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఇకపై ఎలాంటి పాత్రలంటే అలాంటివి చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వెంకట్ అనే కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమాని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. బండ్ల కున్న ఇమేజ్ ని బట్టి తన కథకు సరిపోతాడని డైరెక్టర్ భావించారట. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా మారాలని ప్లాన్స్ రెడీ చేసుకున్న బండ్ల.. ఇందులో నటించడానికి ఆసక్తి కనబరుస్తారో లేదో చూడాలి. ఇకపోతే కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు టైటిల్ రోల్ పోషించిన 'మండేలా' చిత్రాన్ని బండ్ల గణేష్ రీమేక్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మరి ఇప్పుడు వెంకట్ చేయాలని చూస్తున్న సినిమా అదేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇకపోతే 'పరమేశ్వర ఆర్ట్స్' బ్యానర్ పై రవితేజతో 'ఆంజనేయులు'.. పవన్ కళ్యాణ్ తో 'తీన్ మార్' - 'గబ్బర్ సింగ్'.. అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో'.. రామ్ చరణ్ తో 'గోవిందుడు అందరివాడేలే'.. ఎన్టీఆర్ తో 'బాద్ షా' - 'టెంపర్' వంటి సినిమాలు నిర్మించారు బండ్ల. అయితే 2015లో వచ్చిన 'టెంపర్' సినిమా తర్వాత మరో మూవీని నిర్మించలేదు. ఆరేళ్ళ తర్వాత మళ్ళీ నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.