Begin typing your search above and press return to search.
హరీష్ శంకర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్...!
By: Tupaki Desk | 13 May 2020 12:40 PM ISTటాలీవుడ్ ప్రేక్షకులకు బండ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్.. ఆ తరవాత స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి అందరికి షాక్ ఇచ్చాడు. పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మొదలైన స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించాడు. 'గబ్బర్ సింగ్' హిట్ తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ అయ్యాడని చెప్పవచ్చు. తన సినిమాలతోనే కాకుండా తన మాటలతోటి వ్యవహారశైలి తోటి వార్తల్లో ఉంటూ వస్తున్నాడు బండ్ల గణేష్. 'గబ్బర్ సింగ్' సినిమా విడుదలై 8 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.
'గబ్బర్ సింగ్' ఆ రేంజ్ హిట్ కావడానికి పవన్ కళ్యాణ్ కారణమని.. ఆ సినిమా ఎవరితో తీసినా ప్లాప్ అయ్యేదని చెప్పాడు. ఈ సినిమాకి సెకండ్ ఆప్షన్ గా రవితేజ ని అనుకున్నానని.. కానీ పవన్ కళ్యాణ్ వెంటనే ఓకే చేయడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పుకొచ్చాడు. మళ్ళీ నా దేవుడు పవన్ కళ్యాణ్ నన్ను పిలిచి నాకు సినిమా ఇస్తాడని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసాడు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్' సినిమాకి పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాసిన లెటర్ లో తన పేరు ప్రస్తావించకపోవడంపై బండ్ల స్పందించారు. హరీష్ శంకర్ ని పవర్ స్టార్ కి ఇంట్రడ్యూస్ చేసింది నేనే. 'మిరపకాయ్' సినిమాని పవన్ కళ్యాణ్ - హరీష్ కాంబోలో తీయాలని అనుకున్నాను. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో హరీష్ ఆ సినిమాని రవితేజ హీరోగా వేరే ప్రొడ్యూసర్ తో తీసాడు. కానీ పవన్ కళ్యాణ్ హరీష్ ని గుర్తుపెట్టుకొని 'దబాంగ్' రీమేక్ ఆయన చేతిలో పెడదామని సలహా ఇచ్చాడు.
ఈ విధంగా ఎలాంటి ఛాన్సెస్ లేక డిప్రెషన్ లో ఉన్న హరీష్ 'గబ్బర్ సింగ్' ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. కానీ ఆయన నన్ను మర్చిపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను మాత్రమే హ్యాండిల్ చేయగలడు. హరీష్ శంకర్ డైరెక్ట్ స్ట్రైట్ సినిమా హిట్ అయిన నాడు నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడట. ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమాలు తీసిన అల్లు అర్జున్ మరియు రవితేజ, సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ బండ్ల పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. 'మిరపకాయ్' - ' 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి.. కానీ బండ్ల వాటిని ప్లాపులుగా లెక్కగట్టాడని ఫైర్ అవుతున్నారు.
నిజానికి ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ తర్వాత మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీష్ శంకర్ అనే పేరుంది. సినిమాలో హీరోయిజమ్ చూపించాలన్నా.. ఎలివేషన్ సీన్స్ పెట్టాలన్నా హరీష్ శంకర్ వుండాలని స్టార్ హీరోల ఫ్యాన్స్ కోరుకుంటుంటారు. ఇలాంటి నేపథ్యంలో బండ్ల గణేష్ రీమేక్ డైరెక్టర్ అని వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేదని సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు పవర్ స్టార్ రీఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలను లైన్లో పెట్టగా.. మొదటి రెండు సినిమాలను పెద్దగా పట్టించుకోకుండా ఫ్యాన్స్ PSPK 28 పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు హరీష్ శంకర్ స్టామినా. ఏదేమైనా బండ్ల గణేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడని చెప్పుకోవచ్చు.