Begin typing your search above and press return to search.
బండ్లా గణేష్-టీవీ 5 మూర్తి పరిహాసం
By: Tupaki Desk | 18 May 2020 4:00 PM ISTప్రస్తుత ఖాళీ సమయంలో హాస్యనటుడు, చిత్ర నిర్మాత బండ్లా గణేష్ మళ్లీ ట్విట్టర్ లో సూపర్ యాక్టివ్‌గా మారారు. ‘7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కొస్కుంట’ ఎపిసోడ్ తరువాత, భారీ ట్రోలింగ్ కారణంగా నటుడు తన ట్విట్టర్ ఖాతాకు దూరంగా ఉన్నాడు. తాజాగా మరోసారి తన సూపర్ ఫాంతో సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయ్యాడు.
కొద్దిరోజులుగా ట్విట్టర్ లో బండ్ల రాజకీయాలు, సినిమాలపై తెగ ట్వీట్స్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిపై చాలా వ్యంగ్యాలను విసురుతున్నాడు. ఇటీవల బండ్ల గణేష్ టిడిపి భావి వారసుడు నారా లోకేష్ తో పాటు దర్శకుడు హరీష్ శంకర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ట్రోల్ చేశాడు.
తాజాగా ప్రముఖ టీవీ జర్నలిస్ట్ ప్రెజెంటర్, టీవీ 5 మూర్తి ఈ నిర్బంధ కాలంలో మేడపైన సైకిల్ తో వ్యాయామం చేస్తున్న వీడియోలను ట్విట్టర్లో పంచుకున్నారు. టెర్రస్ మీద ఇలా సైక్లింగ్ తో ఎక్సర్ సైజులు చేస్తే మంచిదని సలహా ఇచ్చాడు. చాలా మంది దీనిని గుడ్ ఐడియా అంటూ మెచ్చుకున్నారు.
అయితే అందరిదారిలో నడిస్తే మన బండ్ల గణేష్ ఎందుకు అవుతాడు.. ఆ మూర్తి ఎక్సర్ సైజ్ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన బండ్ల ఒక ఫన్నీగా వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. "దయచేసి మీరు హీరోగా ప్రయత్నించవద్దు" అని ట్వీట్ చేశారు. చూడడానికి హీరోలా ఉన్నావని.. నువ్వు సినిమాల్లోకి వస్తే మాకు కష్టం అన్న తరహాలో బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు.
దానికి టీవీ5 మూర్తి కూడా అంతే సరదాగా కౌంటర్ ఇచ్చాడు. “మీలాంటి గొప్ప నటులు ఉన్నప్పుడు, నేను ఎలా వస్తాను?” అని మూర్తి ట్వీట్ లో బండ్ల గణేష్ కు సమాధానం ఇచ్చాడు. ఈ ఫైర్ బ్రాండ్ జర్నలిస్టుకే పంచ్ ఇద్దామనుకున్న బండ్ల కు సదురు జర్నలిస్టు సమాధానంతో బుక్కైపోయాడు. ఎంతైనా ఈ ఇద్దరి వ్యతిరేక శక్తుల సంవాదం సరదాగా అనిపించింది.