Begin typing your search above and press return to search.

మెహ్రీన్ ను 'బండ తుఫాన్' అంటారా?

By:  Tupaki Desk   |   2 Dec 2017 12:54 PM GMT
మెహ్రీన్ ను బండ తుఫాన్ అంటారా?
X
ఈ పాత్రలు కేవలం కల్పితం మాత్రమే. ఎవరిని కించపరచడానికి కాదు. కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. వినోదం కోసం మాత్రమే. ఈ లైన్లు ప్రతి టీవీ షోలలో కనిపిస్తాయి. అలాగే ప్రతి సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు కనిపిస్తాయి. కానీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగని పట్టించుకోవాలని రూల్ ఏమి లేదు. ఎందుకంటే సినిమాల్లో షోల్లో మనోభావాలను దెబ్బ తీసే సీన్స్ డైలాగ్స్ అప్పుడపుడు వస్తున్నాయి కాబట్టి.

ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం కమెడియన్ ఆదిపై విమర్శలు ఏ స్థాయిలో వస్తున్నాయో అందరికి తెలిసిందే. మనుషులను ఆకారాలను కించపరిచాడని అలాగే సంబంధాల గురించి తప్పుగా సెటైర్లు వేశారని ఎవరికీ తోచినట్లు వారు టీవీల ముందు చెప్పేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు మెగా హీరోపై కూడా అదే తరహాలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే జవాన్ సినిమాలో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాద ని సాయి ధరమ్ తేజ్ బండ తుఫాన్ అని పిలవడం ఆమె అభిమానులకు అస్సలు రుచించడం లేదట. ఆ డైలాగ్ సన్నివేశంలో ఒక భాగమే అయినా కొందరు ఇది కరెక్ట్ కాదు అనే విధంగా అప్ సెట్ అవుతున్నారు.

అయితే మెహ్రీన్ మాత్రం ఇంకా ఫిట్నెస్ లో తేడా రాకపోవడంతో ఆ వర్డ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యిందని విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడి ముఖం కళగా ఉన్నా అందుకు తగ్గట్టుగా హావభావాలను చుపంచడంలో ఇంకా ఏ మాత్రం మెప్పించలేకపోతోందనేది మరో కామెంట్. రీసెంట్ గా వచ్చిన మహానుభావుడు - రాజా ది గ్రేట్ - కేరాఫ్ సూర్యా సినిమాల్లో కూడా బొద్దుగానే కనిపించింది. దీంతో సాయి ధరమ్ తేజ్ బండ తుఫాన్ అని వర్ణించాడు అని మరికొందరు వాదిస్తున్నారు.