Begin typing your search above and press return to search.

బ్యాన్‌ ట్రెండ్‌ తో దిగి వచ్చిన యూవీ క్రియేషన్స్‌!

By:  Tupaki Desk   |   7 April 2020 11:20 AM IST
బ్యాన్‌ ట్రెండ్‌ తో దిగి వచ్చిన యూవీ క్రియేషన్స్‌!
X
ప్రభాస్‌ 20వ చిత్రం అప్‌ డేట్‌ కోసం నెలల తరబడి వెయిట్‌ చేస్తున్న ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో మనస్థాపం చెంది తాజాగా ట్విట్టర్‌ లో బ్యాన్‌ యూవీ క్రియేషన్స్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఆ హ్యాష్‌ ట్యాగ్‌ కాస్త హైదరాబాద్‌ ట్రెండ్స్‌ లో నెం.1 గా నిలిచి అందరు అవాక్కయ్యేలా చేసింది. యూవీ క్రియేషన్స్‌ పై తీవ్రమైన విమర్శలు మీమ్స్‌ వస్తున్న నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం యూవీ క్రియేషన్స్‌ అధికారికంగా స్పందించింది.

ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా అందరి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము పనులు అన్నింటిని కూడా ఆపేశాము. సినిమాకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు సాగడం లేదు. ప్రస్తుత పరిస్థితుల నుండి బయటకు వచ్చిన తర్వాత మీ కోసం ఎన్నో అప్‌ డేట్స్‌ రెడీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలంటే ఇంటికే పరిమితం అవ్వండి అంటూ యూవీ క్రియేషన్స్‌ వారు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

యూవీ క్రియేషన్స్‌ కరోనా కారణంగా అప్‌ డేట్‌ ఇవ్వలేక పోతున్నట్లుగా ప్రకటించింది. ఈ విపత్తు నుండి బయట పడ్డ వెంటనే వరుసగా పలు అప్‌ డేట్స్‌ వస్తాయని ప్రకటించడంతో ఫ్యాన్స్‌ కాస్త చల్లారినట్లుగా ఉన్నారు. మొత్తానికి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చేసిన ట్విట్టర్‌ హ్యాష్‌ ట్యాగ్‌ వార్‌ తో యూవీ క్రియేషన్స్‌ దిగి వచ్చింది. ప్రభాస్‌ 20వ చిత్రం అనుకున్నదాని కంటే చాలా ఆలస్యం అవ్వడంతో పాటు ఇప్పటి వరకు అప్‌ డేట్‌ ఇవ్వక పోవడం వల్ల ఫ్యాన్స్‌ అసహనంతో బ్యాన్‌ యూవీ క్రియేషన్స్‌ అంటూ ట్రోల్‌ చేశారు. ఈ అనుభవంను గుర్తు పెట్టుకుని ఇకపై అయినా జాగ్రత్తగా ఉంటుందని ఆశిస్తున్నాం అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.