Begin typing your search above and press return to search.

ఆర్జీవీని నెట్ ఫ్లిక్స్ ని పర్మినెంట్ గా బ్యాన్ చేయాలి!

By:  Tupaki Desk   |   7 Aug 2021 1:00 PM IST
ఆర్జీవీని నెట్ ఫ్లిక్స్ ని పర్మినెంట్ గా బ్యాన్ చేయాలి!
X
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తారు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఏది బ‌ర్నింగ్ టాపిక్కో దానిని బ‌ర్న్ చేసి ప్ర‌చారం కొట్టేసే ఎత్తుగ‌డ‌తో బ‌రిలో దిగ‌డం ఆర్జీవీ స్టైల్. ఆయ‌న సోష‌ల్ మీడియాల్లో గుప్పించే కామెంట్లు దావాన‌లంలా ప్ర‌పంచాన్ని చుట్టేస్తాయి.

ఆర్జీవీ బాట‌లోనే నెట్ ఫ్లిక్స్ కూడా నిరంత‌రం ఏదో ఒక వివాదాస్ప‌ద వెబ్ సిరీస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. చాలా ఓటీటీలు ఉన్నా కానీ నెట్ ప్లిక్స్ మాత్రం వాట‌న్నింకంటే భిన్నం. వివాదాల‌తో అంట‌గాగ‌డం నెట్ ప్లిక్స్ కి తొలి నుంచి అల‌వాటే. బోల్డ్ కంటెట్ స‌హా థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ ల్లో బోల్డ్ పాత్ర‌ల్ని అంతే వ‌ల్గ‌ర్ గా చూపించ‌డం స‌హా కుల‌మ‌తాల్ని కెల‌క‌డం వ‌గైరా చాలా విష‌యాల్లో నెట్ ప్లిక్స్ వివాదాలను ఎదుర్కొంటోంది. నెట్ ప్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయ‌డానికి ముందు నుంచే హాటెస్ట్ ప్రోమోల‌తో.. వివాదాస్ప‌ద అంశాల‌తో వేడెక్కిస్తుంటుంది. తాజాగా బ్యాన్ నెట్ ప్లిక్స్ అంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద వివాదం చెల‌రేగింది. త‌క్ష‌ణం నెట్ ప్లిక్స్ ఓటీటీనీ బ్యాన్ చేయాల‌ని ఓ వ‌ర్గం దేశవ్యాప్తంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా పిలుపునిచ్చింది.

ఇంత‌కీ నెట్ ప్లిక్స్ ని అంత‌గా వేదిస్తోన్న ఆ వివాదం ఏంటి? బ్యాన్ చేసేంత పాపం నెట్ ప్లిక్స్ ఏం చేసిందో తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. నెట్ ప్లిక్స్ లో `న‌వ‌ర‌స` వెబ్ సిరీస్ రిలీజ్ కు ముందే మంచి పాపుల‌ర్ అయింది. ఢిప‌రెంట్ కంటెంట్ తో తెర‌కెక్కిన ఈ సిరీస్ భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ప్ర‌చారంలో భాగంగా రిలీజ్ అయిన పోస్ట‌ర్ ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. సిద్ధార్థ్- పార్వ‌తి జంట‌గా న‌టిస్తోన్న ఈ సిరీస్ కు సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ గా మారింది. పోస్ట‌ర్ లో సిద్దార్థ్- పార్వ‌తి ఫోటోల వెనుక ఇస్లాం మ‌తానికి సంబంధించిన ప‌విత్ర‌మైన ఖురాన్ శ్లోకాలున్నాయి.

దీంతో ఈ పోస్ట‌ర్ పై తహాఫుజ్-ఇ నమోస్-ఇ రిసలత్ యాక్షన్ ట్రస్ట్ ట్వీట్ చేసి మండిప‌డింది . ప్రచార కార్యక్రమాలలో ఖురాన్ శ్లోకాలను ఉపయోగించడం ఇస్లాంలో అనుమ‌తించ‌దు. శ్లోకాల్ని త‌మ ప్ర‌చారాల‌కు ఎలా వాడుకుంటార‌ని ముస్లీములు మండిపడుతున్నారు. అటుపై చాలా మంది నెటిజ‌నులు సోష‌ల్ మీడియాల్లో ముస్లీముల‌కు మ‌ద్ద‌తు ప‌లుత‌కూ ట్వీట్ లు చేశారు. పోస్ట‌ర్ ని వెంట‌నే తొల‌గించాల‌ని...సిరీస్ లో అలాంటి వివాదాస్ప‌ద అంశాలుంటే త‌క్ష‌ణం తొల‌గించాల‌ని ముస్లీములు హెచ్చ‌రించారు. జ‌రిగిన త‌ప్పుకు వెంట‌నే నెట్ ప్లిక్స్ యాజ‌మాన్యం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై నెట్ ప్లిక్స్ ఇంకా ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. కుల‌మ‌తాల్ని దేవుళ్ల‌ను కెల‌క‌డం ఇప్పుడే కొత్త కాదు కానీ.. ఏదో ఒక వివాదంతో అగ్గి రాజేసి కావాల్సిన ప్ర‌చారం కొట్టేయ‌డం నెట్ ఫ్లిక్స్ కి తొలి నుంచి అలవాటు. ఆర్జీవీ నోటి దురుసును ఆప‌లేం. నెట్ ఫ్లిక్స్ వివాదాల్ని ఆపలేం. అందుకే ఆర్జీవీని నెట్ ఫ్లిక్స్ ని పర్మినెంట్ గా బ్యాన్ చేయాలి!

ఇలాంటి వివాదాలు గ‌తంలో ఎన్నో:

నెట్ ఫ్లిక్స్ సిరీస్ ల‌లో ఫ్రెంచ్ సిరీస్ `క్యూటీస్` ఒక సంచ‌ల‌నం. టీనేజీ ఆడ‌పిల్ల‌ల‌పై అత్యాచారాల నేప‌థ్యంలో వివాదాస్ప‌ద టాపిక్ తో వేడెక్కించింది. అప్ప‌ట్లో ఆ సిరీస్ ని బ్యాన్ చేయాల‌ని వివాదం చెల‌రేగింది. 13 రీజ‌న్స్ వై అనే సిరీస్ టీనేజ‌ర్ల ఆత్మ‌హ‌త్య‌ల వెన‌క కార‌ణాల‌తో తెర‌కెక్క‌గా అది కూడా వివాదాస్ప‌ద‌మైంది. 365 డేస్ అనేది రేప్ క‌ల్చ‌ర్ పై వ‌చ్చిన పోలిష్ మూవీ.. తీవ్ర దుమారం రేపింది. ఇవ‌న్నీ బ్యాన్ చేయాల‌ని డిమాండ్లు నెల‌కొన్నాయి.