Begin typing your search above and press return to search.
'క్రాక్' : థమన్ - అనిరుధ్ కాంబోలో మాస్ పెప్పీ సాంగ్ 'భలేగా తగిలావే బంగారం'
By: Tupaki Desk | 14 Dec 2020 10:53 AM ISTమాస్ మహారాజ్ రవితేజ - శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''క్రాక్''. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'క్రాక్' ప్రచార చిత్రాలు మరియు 'భూమ్ బద్దల్' లిరికల్ వీడియో మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'క్రాక్' నుంచి 'భలేగా తగిలావే బంగారం' అనే సాంగ్ ని విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాటను యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ పాడటం విశేషం.
''ఒప్పుల కుప్పా.. వయ్యారి భామ.. ఒకటో సారి పుట్టినది ప్రేమ.. డేటింగ్ గీటింగ్ మొదలెదామా.. ఊర్లో ఉన్న పార్కులన్నీ చుట్టి వద్దమా..'' అంటూ సాగిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించాడు. 'ఆకారం చూస్తే అబ్బబ్బో.. అవతారం చూస్తే అబ్బబ్బో.. అదిరే అలంకారం చూస్తే అబ్బబో అబ్బబ్బబ్బో..' అంటూ అనిరుధ్ తనదైన శైలిలో ఆలపించారు. ఈ మధ్య మంచి ఫార్మ్ లో ఉన్న థమన్ మరోసారి ఊర్రూతలూగించే సాంగ్ ని అందించాడు. ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కలిపి చేసిన ఈ 'భలేగా తగిలావే బంగారం' సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయనున్నారు.