Begin typing your search above and press return to search.

స్టార్‌ రైటర్‌ కథకు ఓకే చెప్పిన బాలయ్య

By:  Tupaki Desk   |   29 Nov 2020 3:40 PM IST
స్టార్‌ రైటర్‌ కథకు ఓకే చెప్పిన బాలయ్య
X
టాలీవుడ్‌ కు చెందిన పలువురు రచయితలు దర్శకత్వం వైపు అడుగులు వేస్తుంటే స్టార్‌ రైటర్‌ గా పేరు దక్కించుకున్న కోన వెంకట్‌ మాత్రం నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇదే సమయంలో కథ తయారు చేసి దానికి సరైన న్యాయం చేస్తారనుకున్న దర్శకుల చేతిలో సినిమాను పెట్టి వెనుక ఉండి కోన సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. కథ మరియు స్క్రీన్‌ ప్లే అందిస్తున్న కోన వెంకట్‌ తాజాగా బాలకృష్ణతో ఓకే చెప్పించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ మేరకు బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు ఇప్పటికే కమిట్‌ అయిన ఒక సినిమాను చేసిన తర్వాత కోన సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడట.

బాలకృష్ణ కోసం మాస్‌ ఎంటర్‌ టైనర్‌ కథను కోనా రెడీ చేశాడట. ఆ కథ బాగా నచ్చడంతో కోన వెంకట్‌ కు బాలయ్య ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కు శ్రీవాస్‌ డైరెక్ట్‌ చేసే అవకాశం ఉంది. మాస్‌ ఎంటర్‌ టైనర్‌ సినిమాలను శ్రీవాస్‌ చక్కగా డీల్‌ చేయగలడు అంటూ ఇప్పటికే నిరూపితం అయ్యింది. అందుకే ఆయనకు ఈ దర్శకత్వ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 2022లో వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రావచ్చు అంటున్నారు. సక్సెస్‌ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న బాలయ్యకు ప్రస్తుతం బోయపాటి సక్సెస్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. దాని తర్వాత కోన వెంకట్‌ కూడా బాలయ్యకు సక్సెస్‌ ఇచ్చేనేమో చూడాలి.