Begin typing your search above and press return to search.

పవర్ స్టార్‌ సూపర్‌ స్టార్‌ తో బాలయ్య ఢీ కి రెడీ

By:  Tupaki Desk   |   25 April 2021 1:30 PM GMT
పవర్ స్టార్‌ సూపర్‌ స్టార్‌ తో బాలయ్య ఢీ కి రెడీ
X
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను చేస్తున్నాడు. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిన అఖండ సినిమా ను కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గిన తర్వాత పరిస్థితులు సాదారణ స్థితికి వచ్చిన తర్వాత విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అఖండ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే సమయంలో బాలయ్య క్రాక్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ ను గోపీచంద్‌ పూర్తి చేయడం జరిగింది. ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాని ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట.

క్రాక్‌ సినిమా సక్సెస్‌ జోష్‌ మీదున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని మరోసారి రియల్ లైఫ్‌ ఇన్సిడెంట్స్ తో బాలయ్య కోసం కథను సిద్దం చేయడం జరిగిందట. బాలయ్యను ఇంప్రెస్ చేసిన గోపీచంద్ మలినేని అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే బాలయ్య ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నాడు. కరోనా కారణంగా అఖండ సినిమా చాలా ఆలస్యం అయ్యింది. గత ఏడాది విడుదల అవ్వాల్సిన అఖండ ఈ ఏడాదికి వాయిదా వేయడం జరిగింది.

వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్‌ కళ్యాణ్‌ 'హరిహర వీరమల్లు' సినిమాను మరియు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయబోతున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌ లు ఆలస్యం అవుతున్నా కూడా ఈ రెండు సినిమాల విడుదల విషయంలో తేడా ఉండే అవకాశం లేదని మేకర్స్‌ చాలా బలంగా చెబుతున్నారు. సంక్రాంతికి సూపర్‌ స్టార్‌ పవర్‌ స్టార్‌ లు రాబోతున్నా కూడా బాలయ్య కూడా రావడం సాహసమే అవుతుంది. మరి బాలయ్య వారితో పోటీ పడి నెగ్గే అవకాశం ఉందా అనేది చూడాలి. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలోనే కాకుండా అనీల్ రావిపూడి దర్శకత్వంలో కూడా పవన్‌ సినిమా చేయబోతున్నాడు. అనీల్ రావిపూడి మూవీని వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేసే అవకాశాలున్నాయి.