Begin typing your search above and press return to search.

బాలయ్య 'ఆహా' షో మూడవ గెస్ట్‌ తో అంతకు మించి రచ్చ

By:  Tupaki Desk   |   14 Nov 2021 3:21 AM GMT
బాలయ్య ఆహా షో మూడవ గెస్ట్‌ తో అంతకు మించి రచ్చ
X
నందమూరి బాలకృష్ణ ను హీరోగానే ఇప్పటి వరకు చూశాం. కాని ఆహా ఓటీటీ వల్ల బాలయ్య లో కొత్త యాంగిల్ ను కూడా చూస్తున్నాం. ఆహా ఓటీటీ లో బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్‌ టాక్ షో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌ లో మోహన్ బాబు హాజరు అయ్యాడు. మోహన్‌ బాబుతో పాటు ఆయన బిడ్డ మంచు లక్ష్మి మరియు తనయుడు విష్ణులు కూడా హాజరు అయ్యారు. ఆ ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. ఇక రెండవ ఎపిసోడ్‌ తాజాగా స్ట్రీమింగ్‌ అయ్యింది. నాని రెండవ ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చాడు. నాని తో సరదా ముచ్చట్లు.. సీరియస్ విషయాలు ఇలా అన్నింటిని బాలయ్య చెప్పించాడు. ఆ సమయంలోనే బాలయ్య యొక్క గొప్పతనం ను కూడా నాని చెప్పుకొచ్చాడు. నాని మరియు బాలయ్య ల మద్య సాగిన సరదా ముచ్చట్లు ప్రస్తుతం ఆహా వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మొదటి రెండు ఎపిసోడ్స్ కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో మూడవ గెస్ట్‌ ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ అంటూ ఆహా టీమ్ నుండి అనధికారిక సమాచారం వచ్చింది. లైగర్ సినిమా షూటింగ్ కు అమెరికా వెళ్లడానికి ముందు విజయ్ దేవరకొండ వివాహ భోజనంబు సినిమా ప్రమోషన్ లో తెగ పాల్గొన్నాడు. ఆ సమయంలోనే విజయ్ దేవరకొండ అన్ స్టాపబుల్ లో బాలయ్యతో కలిసి టాక్ షో లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే శుక్రవారం ఆహా లో విజయ్ దేవరకొండ షో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. విజయ్ దేవరకొండతో పాటు ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేదా లైగర్ చిత్ర దర్శకుడు పూరి జగన్నాద్ అయినా ఉండే అకవాశాలు ఉన్నాయి.

బాలయ్య మరియు పూరిల మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే పూరి చెప్పి ఒప్పించి బాలయ్య షో అన్ స్టాపబుల్‌ కు విజయ్ దేవరకొండను తీసుకు వచ్చి ఉంటాడని.. అలాగే తాను కూడా కొద్ది సమయం అలా వచ్చి మాట్లాడి ఉంటాడు అనేది ఊహ. నిజంగానే విజయ్ దేవరకొండ అన్ స్టాపబుల్‌ మూడవ ఎపిసోడ్ గెస్ట్‌ అయితే ఖచ్చితంగా మొదటి రెండు ఎపిసోడ్ ల కంటే మూడవ ఎపిసోడ్ రచ్చ రచ్చ చేసే అవకాశం ఉంది. రౌడీ స్టార్ తో బాలయ్య ముచ్చట్లు మరియు ఆడే ఆటల కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అంటే కాస్త బోల్డ్‌ హీరో అనే టాక్ ఉంది. కనుక బ ఆలయ్య ఆ విషయాలను ఎలా మేనేజ్‌ చేస్తూ రౌడీ స్టార్‌ తో టాక్ షో సాగిస్తాడు అనేది చూడాలి. ముందు ముందు మరింత పెద్ద పెద్ద స్టార్స్ కూడా బాలయ్య ముందు కూర్చుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.