Begin typing your search above and press return to search.

'వీర సింహారెడ్డి'తో బాలయ్య టార్గెట్ చేశాడా?

By:  Tupaki Desk   |   12 Jan 2023 12:25 PM IST
వీర సింహారెడ్డితో బాలయ్య టార్గెట్ చేశాడా?
X
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా 'వీర సింహారెడ్డి'. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'క్రాక్‌' మూవీతో ట్రాక్ లోకి వ‌చ్చేసిన గోపీచంద్ మ‌లినేని ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన ద‌గ్గ‌రి నుంచే అభిమానుల్లో అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచ‌నాల‌ని మ‌రింత‌గా పెంచేస్తూ టీజ‌ర్ కేక పుట్టించేసింది. సినిమా ఓ రేంజ్ లో మాస్ కు పూన‌కాలు తెప్పించ‌డం ఖాయం అనే సంకేతాల్ని అందించింది.

దీనికి తోడు బాల‌య్య చాలా ఏళ్ల గ్యాప్ త‌రువాత చేసిన ఫ్యాక్ష‌న్ డ్రామా కావ‌డంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌ భారీగా ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. ఆ అంచ‌నాల మ‌ధ్య జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో బాల‌కృష్ణ డ్యుయెల్ రోల్ లో న‌టించిన 'వీర సింహారెడ్డి' విడుద‌లైంది. ట్రైల‌ర్ లోనే ఏపీ అధికార పార్టీపై రెండు డైలాగ్ ల‌తో పంచ్ లేసిన బాల‌య్య టార్గెట్ చేశాడా? అంటూ నెట్టింట పెద్ద చ‌ర్చే న‌డిచింది. ఇక సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయాడ‌ని సినిమా చూసిన ప్రేక్ష‌కులు, నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు.

అంతే కాకుండా సినిమాలో బాల‌య్య చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ పంచ్ డైలాగ్ లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి బాగా ప‌నికొచ్చేలా వున్నాయని కూడా ప్ర‌చారం చేస్తున్నారు. గ‌తంలో బాల‌య్య న‌టించిన సినిమాల్లోనూ అప్ప‌టి ప్ర‌భుత్వాల‌ తీరు పై ఇండైరెక్ట్ గా ఒక‌టి అరా డైలాగ్ లు వుండేవి అంతే. ఆ డైలాగ్ లు అప్ప‌ట్లో వున్న ప్ర‌భుత్వాల‌పై బాగానే పేలేవి. కానీ 'వీర సింహారెడ్డి'లో మాత్రం బాల‌య్య ప‌నిగ‌ట్టుకుని ఏపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్ గా డైలాగ్ లు పేల్చాడ‌నే కామెంట్ లు మొద‌ల‌య్యాయి.

సినిమాలోని కొన్ని చోట్ల‌ బాల‌య్య ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డుతూ పేల్చిన డైలాగ్ లు ప్ర‌తీ ప్రేక్ష‌కుడికి ఇట్టే అర్థ‌మ‌య్యేలా వున్నాయి. టీడీపీ నాయకులు ఎప్పుడు జగన్ గవర్నమెంట్ మీద ప్రధానంగా చేసే ఆరోపణలు ( ప్ర‌ధానంగా రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో జ‌రుగుతున్న విధ్వంసం, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై దాడులు, వీటి కార‌ణంగా కొత్త ప్రాజెక్ట్ లు, బ‌హుళ‌జాతి కంప‌నీలు రాక‌పోవ‌డం.. భ‌యాన‌క వాతావ‌ర‌ణం కార‌ణంగా వున్న‌వి కూడా రాష్ట్రం వ‌దిలి వెళ్లిపోవ‌డం) వాటితో పాటు .. ట్రైల‌ర్ లో కుర్చీ గురించి.. పేరు మార్పు గురించి పేల్చిన పంచ్ లు ఎన్టీఆర్ వ‌ర్సీటీ పేరు మార్పు విష‌యంలో జ‌రిగిన ర‌గ‌డ గుర్తు చేస్తున్నాయంటున్నారు.

ఇలా జగన్ గవర్నమెంట్ ని ఇండైరెక్ట్ గా తిట్టడానికే పెట్టిన డైలాగ్ లు కోసమే సినిమా తీసినట్టు ఉంది అని కొంత మంది అంటున్నారు . సినిమాలో ఎక్కువ భాగం బాల‌య్య క్యారెక్ట‌ర్ తో టీడీపీ వాళ్లు వైసీపీ ప్ర‌భుత్వంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ని ప్ర‌ధానంగా చేసుకుని ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ రూపంలో వాడిన‌ట్టుగా వున్నాయ‌ని సినిమా చూసిన నెటిజ‌న్ లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమాకు మాత్రం మిక్స్డ్ టాక్ రావ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.