Begin typing your search above and press return to search.

బాలయ్య అందంతో ఆడేసుకుంటున్నారా...?

By:  Tupaki Desk   |   9 Nov 2021 11:30 PM GMT
బాలయ్య అందంతో ఆడేసుకుంటున్నారా...?
X
బాలయ్యకు నందమూరి అందగాడు అని పేరు. ఆయన ఎన్టీయార్ పోలికలతో చూడ చక్కగా ఉంటారు. కెరీర్ మొదట్లో పంచె కట్టుతో చేసిన సినిమాలు కానీ యూత్ ఫుల్ స్టోరీస్ కానీ చూస్తే బాలయ్య అందమేంటో తెలుస్తుంది. అయితే తరువాత కాలంలో బాలయ్య ఎక్కువగా విగ్గుల మీద ఆధారపడ్డారు. వాటిలో కొన్ని ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టేశాయి. బాలయ్య రూపానికి తగిన విగ్గులు ఉంటే ఆయన అందం డబుల్ అవుతుంది. అది సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లక్ష్మీ నరసింహా, లెజెండ్ మూవీస్ తో రుజువు అయింది. ఇక లేటెస్ట్ మూవీ అఖండలో కూడా బోయపాటి బాలయ్యలోని అందగాడిని బయటకు తెచ్చారు. ఆరు పదుల వయసులో ఉన్న బాలయ్య ప్రగ్యా జైస్వాల్ తో చేసిన డ్యూయెట్ లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా బోయపాటి డిజైన్ చేశారు.

ఇక ఇపుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆహా ఓటీటీలో వస్తున్న టాక్ షో లో బాలయ్యను మరింత గ్లామరస్ గా చూపిస్తునాడు అన్న కామెంట్స్ పడుతున్నాయి. బాలయ్యలోని అద్భుతమైన యాంగిల్స్ ని క్యాచ్ చేసి మరీ షూట్ చేస్తున్నాడు. దాంతో సగానికి సగం వయసు తగ్గిపోయి నందమూరి అందగాడు ఈ షోలో హోస్ట్ గా ది బెస్ట్ అనిపించేస్తున్నాడు. బాలయ్య ఏం తింటున్నావయ్యా ఈ ఏజ్ లో ఇంత అందం ఎక్కడిదయ్య అంటూ ఫ్యాన్స్ కూడా కేక పెట్టేస్తున్నారు.

మొత్తానికి బాలయ్య విషయంలో సరైన సబ్జెక్ట్ నే కాదు, సరైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం యంగ్ హీరోలకు ధీటుగా ఆయన్ని ముందు పెట్టి హిట్ కొట్టవచ్చు అంటున్నారు. బోయపాటి లాంటి వారికి బాలయ్య బాడీ లాంగ్వేజ్ మీద పూర్తి అవగాహన ఉంది. అలా కొందరు సెలెక్టెడ్ డైరెక్టర్స్ బాలయ్య లోని అందాన్ని ఎలివేట్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. ఇపుడు లైన్ లో ఉన్న గోపీచంద్, అనిల్ రావిపూడి వంటి వారు కూడా బాలయ్య లో మరే కోణాలను బయటకు తీస్తారో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఏ విధంగా చూసినా నందమూరి అందగాడు బాలయ్యే అంటారు అంతా.