Begin typing your search above and press return to search.

అఫిషియల్‌ : బాలయ్య 'ఆహా' పైసా వసూల్‌

By:  Tupaki Desk   |   10 Oct 2021 12:46 PM GMT
అఫిషియల్‌ : బాలయ్య ఆహా పైసా వసూల్‌
X
నందమూరి బాలకృష్ణ ఏంటీ టాక్ షో చేయడం ఏంటీ అంటూ చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు... వారందరికి కూడా షాక్ ఇచ్చేలా ఆహా నిజమే అంటూ అఫిషియల్‌ గా అనౌన్స్ మెంట్‌ చేసింది. మెగా కాంపౌండ్‌ కు చెందినదిగా ఆహా పై ముద్ర ఉంది. అలాంటి ఆహా లో బాలకృష్ణ టాక్ షో ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ టాక్ షో అంచనాలు మరింతగా పెంచేలా పైసా వసూల్‌ గ్యారెంటీ అంటూ ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు వచ్చిన టాక్ షో లన్నింటికి కూడా ఇది బాప్ అన్నట్లుగా ఉంటుందని నమ్మకంతో ఆహా అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌ లో షేర్‌ చేయడం జరిగింది. ఆహా లో ఇప్పటికే టాక్ షో లు చాలా వచ్చాయి.

టాక్ షోలు అంటే మొహం మొత్తినట్లుగా జనాలు ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్యతో టాక్ షో ను ప్లాన్ చేసి ఆహా ఏమైనా సందడి మొదలు పెట్టిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న బాలయ్య టాక్ షో గురించి ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు చర్చించుకునేలా ఆహా లో అఫిషియల్ అనౌన్స్ మెంట్‌ వచ్చింది. ఈ షో దీపావళి నుండి ప్రారంభం అవుతుందనే టాక్ ఇప్పటికే వచ్చింది. అయితే దసరా మూడు నాలుగు రోజులు ఉండగా షో గురించిన అఫిషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చింది కనుక ఖచ్చితంగా బాలయ్య ప్రమోను దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య మరియు క్రిష్ ల కాంబోలో రూపొందుతున్న ఈ టాక్‌ షో కు సంబంధించిన టైటిల్స్ చాలా చాలా వినిపిస్తున్నాయి. అయితే అఫిషియల్ గా మాత్రం టాక్ షో టైటిల్‌ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. దసరాకు ఈ టాక్ షో కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తారని తెలుస్తోంది. బాలకృష్ణ ను ఇప్పటి వరకు డైలాగ్స్ చెబుతూ సినిమాల్లో చూశాం.. కాని మొదటి సారి సరికొత్త ప్లాట్‌ పామ్‌ పై చూడబోతున్నందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆహా లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ టాక్ షో కు అత్యధిక వ్యూస్ రావడం ఖాయం అంటున్నారు. ఆహా కు ఇప్పటికే భారీ ఎత్తున ఖాతాదారులు అయ్యారు. ఇప్పుడు బాలయ్య షో తో ఆహా ఖాతాదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.