Begin typing your search above and press return to search.

అన్నగారి జయంతి సందర్బంగా బాలయ్య సర్ప్రైజ్ అదే..!

By:  Tupaki Desk   |   27 May 2021 9:30 AM GMT
అన్నగారి జయంతి సందర్బంగా బాలయ్య సర్ప్రైజ్ అదే..!
X
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ టాలెంట్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనలో కేవలం ఓ నటుడు మాత్రమే కాదు. అప్పుడప్పుడు బాలయ్య నుండి గాయకుడు కూడా బయటికి వస్తుంటాడు. ఈ విషయం బాలయ్య చాలాసార్లు ప్రూవ్ చేసాడు. ఏదొక స్పెషల్ మూమెంట్ వచ్చినప్పుడు బాలయ్య గాత్రం సవరించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇప్పుడు మరోసారి బాలయ్యలోని గాయకుడికి పని పడినట్లే తెలుస్తుంది. నిజానికి మే 28న బాలయ్య నుండి ఓ సర్ప్రైజ్ రాబోతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరి సర్ప్రైజ్ అనేసరికి ఈ సినిమా నుండి ఏదైనా రిలీజ్ చేస్తారేమో అని అంతా భావించారు.

ఈరోజు ఉదయం వరకు బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఆ స్పెషల్ సర్ప్రైజ్ గురించి జోరుగా చర్చ జరిగింది. అయితే ఈ సర్పైజ్ బాలయ్య సినిమాలకు సంబంధించిన సర్ప్రైజ్ కాదని అర్థమైంది. అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ తన గానంతో శ్రీరామదండకం విడుదల చేయనున్నారని తాజాగా ప్రకటించారు. స్వయంగా బాలకృష్ణ ఆలపించిన శ్రీరామదండకం ఈ నెల 28వ తేదీన ఉదయం 9:45 గంటలకు విడుదల కానుంది. సీనియర్ ఎన్టీఆర్ ఆయన సినీ ప్రయాణంలో ఎక్కువగా శ్రీరాముడు పాత్రలో కనిపించడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ రాముని గెటప్ ఫోటోలకు బాలయ్య గాత్రంతో వీడియో రిలీజ్ కానుందని నందమూరి అభిమానులు మెచ్చే విధంగా ఈ సర్పైజ్ ఉండబోతుందని సమాచారం.

అయితే బాలయ్య గతేడాది కూడా జగదేకవీరునికథ సినిమాలో ఘంటసాల ఆలపించిన శివశంకరి పాటను పాడి సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు శ్రీరామదండకంతో మరోసారి అభిమానులకు ఆకట్టుకునేందుకు సిద్ధం అయిపోయాడు. నిజానికి బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి.. లేదా బాలయ్య కొత్త సినిమా గురించి ప్రకటన రాబోతుందని ఎక్సపెక్ట్ చేశారు. కానీ బాలయ్య ఆలపించిన శ్రీరామదండకం అనేసరికి ఆసక్తిగానే ఉన్నారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ జయంతి రోజు కాకపోయినా వచ్చే నెల 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అలాంటి సర్ప్రైజ్ లు కావాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం బాలయ్య బోయపాటి సీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ అఖండ చేస్తున్నాడు. ఇప్పటికే టీజర్ తో ఈ సినిమా అంచనాలు రెట్టింపు చేసింది. మరి ఈసారి బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా చూడాలి.