Begin typing your search above and press return to search.
#టికెట్ ఫికర్.. ఏపీ హైకోర్ట్ తీర్పుపై బాలయ్య స్పందన
By: Tupaki Desk | 15 Dec 2021 11:35 AM ISTసినిమా టిక్కెట్ ధరలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పరిశ్రమ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ స్పందించారు. సినీనటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టిక్కెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు.
సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓను ఏపీ హైకోర్టు మంగళవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని.. నిర్మాతలు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారని చెప్పారు. కోర్టు తీర్పు రాకముందే అఖండ చిత్రాన్ని విడుదల చేశామని ఆయన అన్నారు. దేనికైనా తెగించే రిలీజ్ చేశామని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు.
బాలకృష్ణ అఖండ చిత్ర బృందంతో కలిసి బుధవారం విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పెదకాకానిలో బోయపాటి ఇంటికి వెళుతున్నారు.
నేటి మధ్యాహ్నం బోయపాటి ఇంట్లోనే భోజనం కానిచ్చి అటుపై హైదరాబాద్ కి తిరుగు పయనమవుతారని తెలిసింది. అఖండ బాలకృష్ణ కెరీర్ లోనే తొలి 100కోట్ల గ్రాసర్ గా నిలిచింది. సుమారు 54 కోట్ల ప్రీబిజినెస్ చేసిన ఈ మూవీ రికార్డ్ వసూళ్లతో బయ్యర్లు సేఫ్ గా ఉన్నారు. సింహా-లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ ఇస్తానన్న బోయపాటి తన శపథాన్ని అఖండతో నెరవేర్చాడు.
దేవతల మొక్కు తీర్చిన బాలయ్య
ఈసారి కూడా బెజవాడ కనకదుర్గమ్మ సహా మంగళగిరి లక్ష్మీ నరసింహా స్వామి.. పెదకాకాని పేరంటాలమ్మను సందర్శించి మొక్కులు తీర్చారు బాలయ్య- బోయపాటి బృందం. కనకదుర్గమ్మ సందర్భన కోసం మంగళవారం రాత్రి బెజవాడలో దిగిపోయిన బాలకృష్ణ స్థానిక స్టార్ హోటల్లో బస చేశారు.