Begin typing your search above and press return to search.
బాలయ్య రవితేజ కాంబో.. మల్టీ స్టారర్ కాదట!
By: Tupaki Desk | 3 Jan 2022 5:00 AM ISTనందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. బాలయ్య షో కు వస్తున్న గెస్ట్ లతో సందడి చేస్తూ.. ఆడుతూ.. అల్లరి చేస్తూ సరదాగా టాక్ షో ను సాగిస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూ లేదా.. టాక్ షో అన్నట్లుగా కాకుండా అలా అలా సాఫీగా గంట సమయం ను బాలయ్య కానిచ్చేస్తున్నాడు. బాలయ్య టాక్ షో ను ఎలా డీల్ చేస్తాడా అనుకుంటూ ఉండగా మంచి ఉత్సాహంతో నిర్వహిస్తున్న తీరు చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక షో కు వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా వర్క్ చేయాలని అనుకుంటున్నట్లుగా.. చేద్దాం అన్నట్లుగా బాలయ్య చెబుతున్నాడు. బాలయ్యను బోళా అంటూ ఉంటారు... ఆయన షో లో మాటలను వింటూ చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది.
తాజాగా బాలయ్య షో కు రవితేజ వచ్చాడు. ఆ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను మాట్లాడుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మద్య చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతుందని.. ఇద్దరు కూడా తమ సినిమాలను కావాలని పోటీగా విడుదల చేస్తూ ఉంటారనే టాక్ ఉంది. ఆ టాక్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇద్దరి మద్య కనీసం చిన్న పాటి వివాదం కూడా లేదు.. అలాంటిది కోల్డ్ వార్ ఏంటీ అన్నట్లుగా ఇద్దరు నవ్వేసి ఇన్ని రోజులు దాని గురించి మాట్లాడుకున్న వారిని వెర్రి వాళ్లను చేశారు. ఆ విషయంలో క్లారిటీ రావడం ఇద్దరు అభిమానులకు ఆనందం కలిగించే విషయం. ఇక బాలయ్య అందరితో అన్నట్లుగానే రవితేజతో కూడా సినిమా చేద్దాం అన్నాడు.
రవితేజతో సినిమా చేద్దాం అన్నాడు కాని.. కలిసి నటిద్దాం అనకుండా రవితేజ దర్శకత్వంలో సినిమా చేస్తాను అన్నట్లుగా బాలయ్య చెప్పుకొచ్చాడు. రవితేజ గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. కనుక మళ్లీ సినిమా కు డైరెక్ట్ చేయాలనే కోరిక ఆయనకు ఉంది. అయితే తనను తాను డైరెక్ట్ చేయబోను అని.. తన కొడుకును కూడా డైరెక్ట్ చేయను అన్నాడు. దాంతో నాతో సినిమా చేద్దువు లేమ్మా అంటూ రవితేజకు బాలయ్య హామీ ఇచ్చాడు. మంచి కథ రెడీ చేస్తే రవితేజ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయడం పక్కా అన్నమాట. అంటే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా మల్టీ స్టారర్ కాకుండా సోలో స్టార్ మూవీనే కాని రవితేజ దర్శకత్వం అన్నమాట. మరి ఈ కాంబో నిజంగా సెట్స్ పైకి వెళ్లేనా అనేది కాలమే నిర్ణయించాలి. బాలయ్య మాట ఇచ్చాడు కనుక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం రవితేజ చేతిలోనే ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.