Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్‌ కాంబినేష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ డ్రామా!

By:  Tupaki Desk   |   3 Oct 2022 8:00 AM IST
బ్లాక్ బ‌స్ట‌ర్‌ కాంబినేష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ డ్రామా!
X
కొన్ని కాంబినేష‌న్ లు సెట్ కాకుంటే బాగుండ‌ని కోరుకుంటారు అభిమానులు. కానీ కొన్ని కాంబినేష‌న్ లు మాత్రం ఏడాదికి ఒక సారైనా సెట్ కావాల‌ని, వారి నుంచి ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ డ్రామా రావాల‌ని కోరుకుంటుంటారు అలాంటి కాంబినేష‌నే నంద‌మూరి బాల‌కృష్ణ, స్టార్ డైరెక్ట‌ర్‌ బోయ‌పాటి శ్రీ‌నుల‌ది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా అంటే ఫ్యాన్స్ కి మాస్ ఫీస్టే. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా మూడు సినిమాలొచ్చాయి.

మూడూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లే. రీసెంట్ గా బోయ‌పాటి శ్రీ‌ను, బాల‌కృష్ణ‌ల క‌ల‌యిక‌లో `అఖండ‌` వంటి హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా రూపొంది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. యాభై శాతం ఆక్యుపెన్సీలోనూ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అద్భుతం సృష్టించింది. వ‌రుస ఫ్లాపుల్లో వున్న బాల‌య్య‌ను మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.

మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తే చూడాల‌ని అభిమానులు. ప్రేక్ష‌కులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. వీరికి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నార‌ని తెలిసింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో త్వ‌ర‌లో ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలిటిక‌ల్ డ్రామా తెర‌పైకి రానున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత కాలంగా బాల‌య్య పొలిటికల్ మూవీపై చ‌ర్చ జ‌రుగుతోంది.

అయితే దీనికి బోయ‌పాటినే క‌రెక్ట్ అని భావించార‌ట‌. దీంతో ఆయ‌న డైరెక్ష‌న్ లోనే ఈ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్‌చేస్తున్నాట్టుగా తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ని 2023 ద్వితీయార్థంలో ప్రారంభించి 2024 వేస‌విలో ఎన్నిక‌ల‌లోపు ప్రేక్షుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ భారీ యాక్ష‌న్ డ్రామాని ఏకె ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ రెండింటి త‌రువాతే బోయపాటి ప్రాజెక్ట్ వుంటుంద‌ని తెలిసింది.