Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్..?

By:  Tupaki Desk   |   20 April 2021 5:30 AM GMT
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్..?
X
టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అయితే అనిల్ ఎప్పటి నుంచో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. బాలకృష్ణకి ఇప్పటికే ఓ స్టోరీ లైన్‌ చెప్పానని.. ఆయన నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉందని వెల్లడించారు. అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలయ్య సైడ్ నుంచి ఈ స్టోరీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

బాలయ్య కోసం అనిల్ రవితేజ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారని.. దీనికి గ్రీన్ సిగ్నల్ రావడంతో వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తారని టాక్ నడుస్తోంది. అంతేకాక ఈ ప్రతిష్టాత్మక సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందనుందని అంటున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' అనే సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. దీని తర్వాత గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ క్రమంలో అనీల్ రావిపూడితో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో 'ఎఫ్ 3' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కోవిడ్ సోకడంతో క్వారంటైన్ లో ఉన్న దర్శకుడు.. వచ్చే నెలలో మైసూర్ లో ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. 'ఎఫ్ 3' చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయనున్నారు. నిజానికి బాలయ్యతో పాటుగా మహేష్ బాబు - రామ్ పోతినేని లతో సినిమాలు చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నారు అనిల్. అయితే మహేష్ 'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తారని టాక్ వస్తోంది. అలానే రామ్ ఇటీవలే లింగుస్వామి దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ కి కమిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ముందుగా బాలయ్య తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.