Begin typing your search above and press return to search.

బాలయ్యతో భలే ఆన్సర్స్ రప్పించిన అల్లు శిరీశ్..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 4:42 AM GMT
బాలయ్యతో భలే ఆన్సర్స్ రప్పించిన అల్లు శిరీశ్..!
X
ఈమధ్య ఇండస్ట్రీలో నందమూరి అల్లు ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు పరిశ్రమకు కొత్త జోష్ ని ఇస్తున్నాయి. అల్లు అరవింద్ ఆహా అన్ స్టాపబుల్ కోసం బాలయ్యని తీసుకోవడమే ఈ కొత్త ఉత్సాహానికి నాంది పలికింది. అంతకుముందు కూడా ఈ రెండు ఫ్యామిలీల మధ్య మంచి రిలేషన్ ఉన్నా ఈ షో ద్వారా ఇంకాస్త క్లోజ్ అయ్యారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అల్లు శిరీశ్ సినిమా ఈవెంట్ కి బాలయ్య గెస్ట్ గా వచ్చి సినిమాని ఆశీర్వదించారు.

ఆదివారం జరిగిన ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు శిరీష్, బాలయ్య బాబుల మధ్య జరిగిన డిస్కషన్ అందరిని అలరించింది. బాలయ్యని ప్రశ్నలడిగే డేర్ ఎవరైనా చేస్తారా.. ఆ జాబ్ తీసుకున్నాడు అల్లు శిరీశ్.. సుమ దగ్గర మైక్ తీసుకుని బాలకృష్ణ గారిని నేను ప్రశ్నలు అడుగుతా అని వచ్చాడు అల్లు శిరీశ్. సార్ మీ కోట్ల మంది అభిమానుల్లో ఒకడిగా మీ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం కోరుతున్నా అని అనగా బాలయ్య కూడా అంతే సరదాగా ఓకే అనేశారు.

మీతో నటించిన హీరోయిన్స్ లో ఊర్వశి ఎవరు.. రాక్షసి ఎవరు అని.. విజయశాంతి, సిమ్రాన్, నయనతార, శృతి హాసన్ పేర్లు ఆప్షన్ ఇవ్వగా.. వారిలో నయనతార ఊర్వశి.. శృతి హాసన్ రాక్షసి అని చెప్పారు బాలయ్య.

ఇక మీరు నటించిన సింహా పేరుతో వచ్చిన సినిమాల్లో ఒక సినిమా మీరు మర్చిపోయారు అది ఏంటని అన్నారు.. దానికి ఆన్సర్ కూడా సింహం నవ్వింది అని అల్లు శిరీశ్ చెప్పగా.. నా ఫ్లాప్ సినిమా గురించి నువ్వు ఇప్పుడు చెబుతావా అని నవ్వుతూ అన్నారు బాలయ్య. సింహం నవ్వితే జనాలు చూస్తారా చూడలేదు అంతే.. అయినా కొన్ని సినిమాలు మన అంచనాలను రీచ్ అవ్వవని అన్నారు. ఇక మీ సినిమాలో నాకు ఒక ఛాన్స్ కావాలని అడిగితే పరశురాం వైపు చూసి చూడవయ్యా ఏదో అడుగుతున్నాడు అని అన్నారు.

ఇక బాలయ్య కూడా అల్లు శిరీశ్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. బయట కొంటె కృష్ణుడు అని విన్నాను.. నిజమేనా.. రొమాన్స్ లు సినిమా వరకేనా బయట కూడానా అని అన్నారు. ఇంతకీ పెళ్లెప్పుడు.. మీ నాన్న పక్కనే ఉన్నాడు ఆయన అడగలేని ప్రశ్నలు నేను అడిగి ఆయనకి క్లారిటీ ఇస్తున్న అని అన్నారు.

మొత్తానికి బాలయ్య, అల్లు శిరీశ్ ల ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. మైక్ పట్టుకుని నా పోస్ట్ కే ఎసరు పెట్టాలని అనుకుంటున్నావా అన్ని లాగుతా.. నా షోకి వస్తావ్ గా అప్పుడు అన్ని లాగుతా.. ఈమధ్యనే శర్వానంద్, అడివి శేష్ ల గురించి మొత్తం బయట పెట్టా నువ్వు వస్తావ్ కదా అప్పుడు నీ గురించి మొత్తం బయట పెట్టేలా చేస్తానని అన్నారు బాలయ్య. ఈ సరదా చిట్ చాట్ వేడుకకి కొత్త జోష్ ఇచ్చింది. బాలయ్య ఎనర్జీ గురించి అల్లు శిరీశ్ ఇచ్చిన స్పీచ్ అయితే నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.