Begin typing your search above and press return to search.

బడ్జెట్ కంట్రోల్ పై దృష్టి పెట్టిన బాలయ్య..!

By:  Tupaki Desk   |   28 April 2021 4:30 PM GMT
బడ్జెట్ కంట్రోల్ పై దృష్టి పెట్టిన బాలయ్య..!
X
నందమూరి బాలకృష్ణ సినిమాల విషయంలో ఎంత నిబద్ధతతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వందకు పైగా సినిమాలు చేసిన అనుభవం ఉన్న బాలయ్య.. తన వల్ల ప్రొడ్యూసర్ నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అదనపు కాల్షీట్స్ కూడా అవసరం లేకుండా సకాలంలో షూటింగ్ పూర్తి చేసేలా వారికి సహకరిస్తుంటాడు. ఇలా మొదటి నుంచి కూడా నిర్మాతల గురించి ఆలోచిస్తూ బాలయ్య బడ్జెట్ కంట్రోల్ అయ్యేలా చూస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఆయన నటిస్తున్న 'అఖండ' సినిమా విషయంలో కూడా బాలయ్య ఇదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 65 - 70 కోట్ల మధ్య ఉంటుందని టాక్ ఉంది. భారీ బడ్జెట్ కావడంతో దాన్ని నియంత్రించడానికి రెమ్యూనరేషన్ తక్కువ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. సినిమా బడ్జెట్ లో సింహభాగం హీరో - డైరెక్టర్ పారితోషికాలే ఉంటాయి కాబట్టి బాలయ్య - బోయపాటి చర్చించుకుని ఈ డెసిషన్ తీసుకున్నారట. ఈ నేపథ్యంలో బాలయ్య 7 నుంచి 7.5 కోట్లు మాత్రమే తీసుకుని.. సినిమా లాభాల్లో వాటా తీసుకోనున్నారట. ఇక బోయపాటి రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోకుండా తన సినిమాపై నమ్మకంతో లాభాలను పంచుకునేందుకు నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా డిజిటల్ రైట్స్ కూడా అధిక ధరలకు అమ్ముడైతే.. హీరో మరియు దర్శకనిర్మాతలు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.

కాగా, 'అఖండ' సినిమాలో ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ - పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'అఖండ' టీజర్ విశేష స్పందన తెచ్చుకొని అంచనాలు పెంచేసింది. ఈ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటివరకు 48 మిలియన్లకు పైగా వ్యూస్, 430K లైక్స్ దక్కించుకుని సంచలనం సృష్టించింది. సీనియర్ హీరోల సినిమాలలో తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. మరో 2 మిలియన్ల వ్యూస్ వస్తే 50 మిలియన్ల 'ఆర్.ఆర్.ఆర్' - 'పుష్ప' టీజర్స్ రికార్డ్స్ సరసన 'అఖండ' చోటు సంపాదించుకుంటుంది.