Begin typing your search above and press return to search.

అమెరికాలో బాల‌య్య ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   3 Dec 2021 5:31 AM GMT
అమెరికాలో బాల‌య్య ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌
X
న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలో ఆయ‌న ఫ్యాన్స్ మాసిజం గురించి తెలిసిందే. బాల‌య్య బ‌ర్త్ డే వేడుక‌ల‌తో పాటు.. ఆయన సినిమా విడుదలల స‌మ‌యంలో హంగామా తెలిసిన‌దే. అమెరికాలో భారీగా అభిమానులను కలిగి ఉన్నారు. బాల‌య్య సినిమా వ‌స్తోంది అంటే క్లాస్ కూడా మాస్ గా మారిపోయి బోలెడంత హంగామా సృష్టిస్తారు.

నిన్న అమెరికాలో అఖండ విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. థియేట‌ర్ వ‌ద్ద‌నే ఠెంకాయ‌లు ప‌గుల గొట్టి నానా ర‌చ్చ చేశారు. తాజాగా మ‌రికొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. డల్లాస్ లోని అఖండ థియేటర్ కి వెళుతూ టెక్సాస్ అభిమానులు బోలెడంత ర‌చ్చ చేశారు. `డల్లాస్ బాలయ్య యువసేన` పసుపు బ్యానర్ లతో `జై బాలయ్య` నినాదాలతో భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోనూ అఖండ చాలా లొకేషన్లలో విడుద‌లై విజ‌య‌వంతంగా ఆడుతోంది. నెగెటివ్ రివ్యూలు ఉన్నా కానీ.. బాల‌య్య మాస్ ప‌వ‌ర్ ఏంటో బాక్సాఫీస్ వ‌ద్ద‌ తెలిసొస్తోంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ బాల‌య్య మాస్ ఫ్యాన్స్ థియేట‌ర్ల‌కు క‌దిలి రావ‌డంతో వ‌సూళ్ల లెక్క‌లు పెద్ద‌గానే తేల‌నున్నాయ‌ని తెలుస్తోంది. చాలా కాలం త‌ర్వాత మాస్ లో మ్యాసివ్ హంగామా షురూ అయ్యింది.