Begin typing your search above and press return to search.

'అన్ స్టాపబుల్-2' కోసం భారీగా డిమాండ్ చేస్తున్న బాలయ్య..?

By:  Tupaki Desk   |   8 April 2022 7:28 AM GMT
అన్ స్టాపబుల్-2 కోసం భారీగా డిమాండ్ చేస్తున్న బాలయ్య..?
X
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' అందించిన ''అన్ స్టాపబుల్'' టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ స్పేస్ లో అడుగుపెడుతూ తొలిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో.. అత్యధిక వ్యూయర్ షిప్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రతీ ఎపిసోడ్ కు అశేష ప్రేక్షకాదరణ దక్కడంతో ఐఎండీబీ రేటింగ్స్ లో స్థానం సంపాందించింది. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ సీజన్ పూర్తవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి 'అన్ స్టాపబుల్ విత్ NBK' సీజన్-2 మీద పడింది. ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టాక్ షో గురించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.

'అన్ స్టాపబుల్' రెండో సీజన్ ఉంటుందని అటు నిర్వాహకులు ఇటు బాలయ్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు. మొదటి సీజన్ కు అనూహ్య స్పందన రావడంతో రెండో సీజన్ ని పెద్ద ఎత్తున ప్లాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తయిందట. అయితే ఇప్పుడు బాలకృష్ణ రెమ్యునరేషన్ విషయమే ఇంకా తేలలేదని టాక్ వినిపిస్తోంది.

'ఆహా' వీడియోని దిగ్గజ ఓటీటీలకు ధీటుగా నిలిపిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. నందమూరి బాలకృష్ణని హోస్ట్ గా ప్రెజెంట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీని కోసం బాలయ్యకు డీసెంట్ రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. అయితే ఇప్పుడు 'అన్‌ స్టాపబుల్' సీజన్ 2 కోసం సీనియర్ హీరో ఎక్కువగా కోట్ చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి 'అన్‌ స్టాపబుల్' షో బాలయ్య మీద నెగిటివిటీని చాలా వరకు తగ్గించింది. ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసింది. మరోవైపు ఈ టాక్ షోతో 'ఆహా' ఓటీటీకి పెద్ద ఎత్తున సబ్‌స్క్రిప్షన్ పెరిగింది.

ఇప్పుడు రెండో సీజన్ చేయడం వల్ల అటు బాలయ్య ఇటు ఆహా ఓటీటీకి రెట్టింపు లాభం చేకూరే అవకాశం ఉంది. కాకపోతే బాలకృష్ణ సీజన్-1 కు తీసుకున్న దాని కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు 'అన్‌ స్టాపబుల్ 2' డీల్ కోసం బాలయ్యతో చర్చలు జరపడానికి అల్లు అరవింద్ రంగంలోకి దిగారని టాక్ నడుస్తోంది.

కాగా, 'అన్ స్టాపబుల్' మొదటి సీజన్ లో మంచు మోహన్ బాబు - మహేష్ బాబు - అల్లు అర్జున్ - రవితేజ - నాని - రానా దగ్గుబాటి - విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా - రాజమౌళి - అనిల్ రావిపూడి - బ్రహ్మానందం సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి సీజన్-2 కి గెస్టులుగా ఎవరెవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

'అన్ స్టాపబుల్ 2' కు మొదటి గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉందని షో క్రియేటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఈసారి అనేకమంది సినీ ప్రముఖులు రావడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ టాక్ షో రెండో సీజన్ ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ రానుంది.