Begin typing your search above and press return to search.

పునీత్ రాజ్ కుమార్ కు బాలక్రిష్ణ నివాళి.. తల బాదుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు

By:  Tupaki Desk   |   30 Oct 2021 10:30 AM GMT
పునీత్ రాజ్ కుమార్ కు బాలక్రిష్ణ నివాళి.. తల బాదుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు
X
కన్నడ ప్రముఖ కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ మరణం సినీ పరిశ్రమను శోకసంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా పునీత్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్ తో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు.

శనివారం కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్ కుమార్ పార్తీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ప్రజలు లక్షల్లో పునీత్ పార్థీవ దేహాన్ని దర్శించారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలక్రిష్ణ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ముందు బాలక్రిష్ణ చాలా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ తల పట్టుకొని తన భావోద్వేగాన్ని ప్రదర్శించారు. బాలక్రిష్ణతో నిర్మాత సాయి కొర్రపాటి ఉన్నారు.

తెలుగు చిత్రసీమతో రాజ్ కుమార్ ఫ్యామిలీకి దగ్గరి సంబంధాలున్నాయి. మన నటీనటులను ఎంతగోనా ఆదరించేవారు. పునీత్ రాజ్ కుమార్ తో బాలక్రిష్ణకు ఎక్కువ స్నేహ సంబంధాలున్నాయి. బెంగళూరు వచ్చిన తెలుగు హీరోలను పునీత్ కలిసేవాడు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి దూరం కావడంతో బాలయ్య సహా హీరోలుజీర్ణించుకోవడం లేదు. ప్రమోషన్ కోసం బెంగళూరు వచ్చిన బాలయ్య ముఖం మీద ఏదో పడితే గతంలో పునీత్ తుడిచిన వీడియో వైరల్ అయ్యింది. అంతగా వీరిద్దరి మధ్య బంధం ఉండేది.

ప్రస్తుతం పునీత్ కుమార్తె అమెరికాలో ఉన్నారు. ఆమె శనివారం బెంగళూరుకు చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.