Begin typing your search above and press return to search.
వినయ విధేయ రామా అనుభవం గుర్తుందా ఇంకా?
By: Tupaki Desk | 16 Dec 2020 3:00 PM ISTటాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అనగానే భయపెట్టే అనుభవాలు కొన్ని ఉన్నాయి. వర్తమానానికి ఆధారంగా నిలిచే గతం సజీవంగానే ఉంది. కంటి చూపుతోనే 20 భోగీల రైలు వెనక్కి వెళ్లిపోవడం.. గాల్లో కత్తులు ఎగిరిపోవడం వగైరా జనాలు గుర్తు తెచ్చుకుంటారు. వీటన్నిటికీ మించి బాప్ అనిపించేలా రామ్ చరణ్ `వినయ విధేయ రామ` యాక్షన్ పార్ట్ షాకిస్తుంది. గాల్లో తేలిన విలన్ తలకాయ ఎటెళ్లిందో తెలిసేలోపే షాక్ ల మీద షాక్ లు తిన్నారు థియేటర్లలో జనం. అదొక హిస్టరీగా రికార్డులకెక్కింది.
మరి ఇప్పుడు కూడా అలాంటి ఘోరమైన యాక్షన్ ని జనాలు ఆదరిస్తారా? అందుకేనేమో నటసింహా నందమూరి బాలకృష్ణ చాలా అలెర్టుగా ఉన్నారన్న గుసగుస వినిపిస్తోంది. తాజా చిత్రం బిబి 3లో యాక్షన్ సీన్స్ ని రియాలిటీకి దగ్గరగా తెరకెక్కించాలని బోయపాటికి సూచించారట.
ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ పరంగా మాస్ ట్రీట్ ఓ లెవల్లోనే ప్లాన్ చేశారట బోయపాటి. మెజారిటీ టాకీ పూర్తి చేసి నెక్ట్స్ షెడ్యూల్ లో యాక్షన్ పార్ట్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. బోయపాటి తన చిత్రాలలో కొన్ని ఓవర్-ది-టాప్ యాక్షన్ సన్నివేశాలను చూపించారు. వాటికి సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ట్రోలింగ్ ఎదురైంది. మారిన ట్రెండ్ కి తగ్గట్టే వాస్తవికత మిస్ కాకూడదన్నది బాలయ్య వెర్షన్. ట్రోలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్నది ఆయన ముందస్తు జాగ్రత్త అని గుసగుసలు వినిపిస్తున్నాయి. బోయపాటి లైన్ దాటకుండానే యాక్షన్ ని డిజైన్ చేస్తారనే ఎన్బీకే అభిమానులు భావిస్తున్నారు.