Begin typing your search above and press return to search.
బాలయ్య 'మోనార్క్' రీ షెడ్యూల్ డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 2 Nov 2020 12:20 PM ISTనందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ కరోనా కారణంగా మార్చిలో నిలిపేశారు. అప్పటి నుండి మళ్లీ ఇప్పటి వరకు షూటింగ్ పునః ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు బాలయ్య డేట్లు ఇచ్చాడు. జాగ్రత్తల మద్య బాలయ్య బోయపాటిల మూవీ షూటింగ్ కు ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో బిబి3 షూటింగ్ ను నిర్వహించబోతున్నారట. ఈనెల 16వ తారీకు నుండి బాలకృష్ణ పై చిత్రీకరణ ప్రారంభం అవ్వనుంది. అంతుకు వారం రోజుల ముందే బాలయ్య లేకుండా షూట్ చేయబోతున్నారు.
సీనియర్ హీరోలు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతూ షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. బాలయ్య వయసు రీత్యా ఆయన్ను కుటుంబ సభ్యులు ఇన్ని రోజులు షూటింగ్ లకు దూరంగా ఉండమని విజ్ఞప్తి చేశారట. ఇంకా ఎంత కాలం షూటింగ్ చేయకుండా సినిమాను మద్యలో వదిలేస్తామనుకున్న బాలయ్య ఈనెల 16 నుండి షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు ఓకే చెప్పారట. సింహా లెజెండ్ ల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కీలకమైన యంగ్ పొలిటీషియన్ పాత్రను యంగ్ హీరోతో చేయించేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పలువురు హీరోల పేర్లు వినిపించాయి. తాజాగా నందమూరి తారకరత్న ను ఆ పాత్రకు ఓకే చేశారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
షూటింగ్ ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే సినిమా టైటిల్ విషయమై అధికారికంగా క్లారిటీ ఇచ్చే విషయమై చర్చలు జరుగుతున్నాయి. సంక్రాంతికి బిబి3 టీజర్ లేదా మొదటి పాటను విడుదల చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ అనుకున్నట్లుగా సక్రమంగా జరిగితే వచ్చే ఏడాది ఉగాదికి లేదా సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు.