Begin typing your search above and press return to search.

2020 బిగ్‌ జోక్‌.. ఎన్టీఆర్‌కు తండ్రిగా బాలయ్య

By:  Tupaki Desk   |   30 Jan 2020 9:17 AM GMT
2020 బిగ్‌ జోక్‌.. ఎన్టీఆర్‌కు తండ్రిగా బాలయ్య
X
అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌(నాన్‌ బాహుబలి) ను దక్కించుకున్న త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌ తో చేయడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ ఎప్పుడైతే ఆ సినిమా షూటింగ్‌ ను ముగించుకుంటాడో వెంటనే త్రివిక్రమ్‌ కు డేట్లు ఇవ్వబోతున్నాడు. ఈలోపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ ను సిద్దం చేసే పనిలో ఉంటాడు. వీరిద్దరి కాంబో మూవీ అనగానే అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా వీరి కాంబో మూవీ గురించి సోషల్‌ మీడియా లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు గా వారు పోస్ట్‌ లు చేస్తున్నారు. తాజాగా నందమూరి అభిమాని ఒకరు త్రివిక్రమ్‌ దర్శకత్వం లో ఎన్టీఆర్‌ హీరోగా నటించబోతున్న చిత్రంలో బాలకృష్ణ కీలక పాత్రలో నటించబోతున్నాడట. అది కూడా ఎన్టీఆర్‌ కు తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించేందుకు ఒప్పుకున్నాడని.. త్రివిక్రమ్‌ సినిమాల్లో తండ్రి పాత్రలు అంటే చాలా కీలకంగా ఉంటాయి. కథకు చాలా ప్రాముఖ్యత ను కలిగి ఉంటాయి. అందుకే బాలకృష్ణ తండ్రి పాత్రకు ఒప్పుకున్నాడేమో అంటూ అతడు పోస్ట్‌ చేశాడు.

అతడి పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నిజంగా ఎన్టీఆర్‌ మరియు బాలకృష్ణ లు కలిసి నటించబోతున్నారేమో అంటూ అభిమానులు ఆశపడ్డారు. తండ్రి కొడుకుల పాత్రల్లో బాలయ్య ఎన్టీఆర్‌ ను చూడబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ చాలా మంది కామెంట్స్‌ చేశారు. కాని అది నూటికి నూరు శాతం పుకారు మాత్రమే. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్‌ జోక్‌ గా.. జోక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకే స్టేజ్‌ పై ఇద్దరిని చూడటమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఇద్దరిని ఒకే సినిమాలో అది కూడా తండ్రి కొడుకులుగా చూడటం అంటే అసాధ్యం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ కాంబో అనేది ఫ్యాన్స్‌ కు కలగానే మిగిలి పోయే అవకాశం ఉందని.. మరీ అంతగా ఊహించుకుంటే నిరాశ తప్పదంటే విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.