Begin typing your search above and press return to search.

బాలయ్య కోసం యునిక్ స్క్రిప్ట్ కు మరింత పదును పెడుతున్న స్టార్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   29 Jun 2021 11:00 PM IST
బాలయ్య కోసం యునిక్ స్క్రిప్ట్ కు మరింత పదును పెడుతున్న స్టార్ డైరెక్టర్..!
X
'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమా చేస్తున్నాడు. సూపర్ హిట్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫన్‌ అండ్ ఫ్రస్టేషన్‌ కి ఫైనాన్స్ ని జత చేసి 'ఎఫ్ 3' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే 'ఎఫ్ 3' చిత్రానికి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. 10 శాతం మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉందని.. అది కూడా ప్యాచ్ వ‌ర్క్ లు.. చిన్న ఫారిన్ షెడ్యూల్ అని టాక్ వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సైలెంటుగా ఉన్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు 'ఎఫ్ 3' ఫైనల్ స్టేజీకి వచ్చేయడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పై ఫోకస్ పెడుతున్నాడట.

నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. 'సుప్రీమ్' తర్వాత 'రామారావు' అనే స్క్రిప్ట్ తో బాలయ్యను కలిసాడు కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలో తన ఫేవరేట్ హీరోతో సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి.. ఇప్పటికే మరో స్క్రిప్ట్ ని నేరేట్ చేశాడు. దీనిని బాలయ్య సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

'ఎఫ్ 3' షూటింగ్ చివరి దశకు రావడంతో బాల‌య్య‌కు చెప్పిన క‌థ‌ను మ‌రింత ప‌దునుగా త‌యారు చేసే ప‌నిలో ఉన్నాడట స్టార్ డైరెక్ట‌ర్ అనిల్. ఇదొక యునిక్ స్క్రిప్ట్ అని.. ఇంతకముందు చూడని విధంగా బాలకృష్ణ ను చూపిస్తానని అనిల్ రావిపూడి చెబుతూ వస్తున్నాడు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటసింహాన్ని అనిల్ ఎలా చూపిస్తాడో చూడాలి. గోపీచంద్ మలినేని తో సినిమా పుర్తయ్యాక.. బాలకృష్ణ - అనిల్ కాంబోలో సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.