Begin typing your search above and press return to search.

#USA అఖండ మాస్ మాస్ ఊర‌మాస్

By:  Tupaki Desk   |   2 Dec 2021 10:32 AM GMT
#USA అఖండ మాస్ మాస్ ఊర‌మాస్
X
త‌మ అభిమాన తార‌ల సినిమాలు రిలీజ‌వుతున్నాయంటే పాలాభిషేకాలు పూజ‌లు పున‌స్కారాల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అనాదిగా వ‌స్తున్న ఆచార‌మిది. చిరంజీవి- బాల‌కృష్ణ యుగంలో ఇది ప‌రాకాష్ఠ‌కే చేరుకుంది. ఇటీవ‌లి కాలంలో మ‌రీ అంత‌గా క‌నిపించ‌లేదు. కానీ అఖండ రిలీజ్ అనంత‌రం మ‌రోసారి బాల‌య్య ఫ్యాన్స్ లోని మాసిజం బ‌య‌ట‌ప‌డింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమా ఎప్పుడు వచ్చినా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. అఖండ‌కు క‌టౌట్లు క‌ట్టారు. పాలాభిషేకం చేసారు. పోస్టర్ల ముందు కొబ్బరికాయలు పగులగొట్టారు. పూజ‌లు పున‌స్కారాలు సాగాయి.

కానీ పాశ్చాత్య దేశాల్లో అలా కాదు. ఒక తెలుగు లేదా తమిళ చిత్రం అక్కడ తెరపైకి వచ్చినప్పటికీ ఆ థియేటర్లలో అభిమానులు అంత‌గా హ‌డావుడి చేయ‌డం మనకు కనిపించదు. అయితే నిన్న రాత్రి అమెరికాలో ఊహించ‌ని విధంగా మాస్ ఘటన ఒకటి జరిగింది. నందమూరి బాలకృష్ణ న‌టించిన‌ అఖండ ప్రీమియర్ కు ముందు కాలిఫోర్నియాలోని సెర్రా థియేటర్స్ లో నందమూరి అభిమానులు ఆయన పోస్టర్ ముందు కేక్ కట్ చేసారు. చాలా కొబ్బరికాయలు పగులగొట్టారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో టూటైర్ సిటీల్లో స్థానిక థియేటర్లలో ఈ రకమైన హంగామా కనిపిస్తుంది. ఇదే త‌ర‌హా మాసిజం అమెరికాకు పాకింద‌ని అర్థ‌మ‌వుతోంది. అఖండ నేడు విడుద‌ల కాగా మాస్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బోయపాటి శ్రీను-బాలయ్య హ్యాట్రిక్ కాంబినేష‌న్ ఇది. ప్రగ్యా జైస్వాల్- శ్రీకాంత్- జగపతిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అఖండ మాస్ మాస్ ఊర‌మాస్ అంటూ ఫ్యాన్స్ లో టాక్ వినిపిస్తోంది.