Begin typing your search above and press return to search.
అల్లు తో బాలయ్య.. లైన్ లో ఇద్దరు
By: Tupaki Desk | 2 Jun 2023 12:28 PM GMTవరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ల ను సొంతం చేసుకుని.. ఫుల్ ఫామ్ తో కనిపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టుల ను వరుసగా లైన్ లో పెట్టుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమా ను చేస్తున్నారు. ఇది పూర్తి కాకముందే మరికొన్ని ప్రాజెక్టు లు ఓకే చేసేశారు.
నందమూరి బాలకృష్ణ త్వరలోనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఒక సినిమా ను చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే, ఆయన బాబీ తో ఒక సినిమా, ప్రశాంత్ వర్మతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్టు ఎవరితో ఉంటుంది అన్న దాని పై క్లారిటీ రావట్లేదు. ఫలితంగా ఇప్పుడిది సస్పెన్స్‌గా మారింది.
బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్టుల పై ఒకవైపు చర్చలు జరుగుతుండగా.. ఆయన బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బ్యానర్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు ను చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన ప్రెస్‌మీట్ లో బోయపాటి తో తమ బ్యానర్ లో సినిమా ఉంటుందని అరవింద్ చెప్పారు. దీంతో బాలయ్య తో ఈ మాస్ డైరెక్టర్ సినిమా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్‌లోనే ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అటు బోయపాటి, ఇటు బాలయ్య ఇద్దరూ అల్లు అరవింద్ కు కమిట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేసే సినిమా ను తమ బ్యానర్ లోనే చేయాలని ఈ బడా ప్రొడ్యూసర్ భావిస్తున్నారట. అయితే, ఈ కాంబోను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో చేయించడానికి ఆ నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో బాలయ్య - బోయపాటి ఏ బ్యానర్ లో సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరో వైపు, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనూ బాలయ్య సినిమా చేసే అవకాశం ఉంది. ఒకవేళ బోయపాటి తో నటసింహం కాంబినేషన్ సెట్ అవని పక్షంలో.. ప్రశాంత్ తో నైనా చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలకృష్ణ మాత్రం గీతా ఆర్ట్స్‌లో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నారన్నది కన్ఫార్మ్ అయింది. దీని పై అల్లు, నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారని చెప్పుకోవచ్చు.