Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి కోరిక తీర్చిన బాల‌కృష్ణ‌

By:  Tupaki Desk   |   7 Dec 2021 6:00 AM IST
రాజ‌మౌళి కోరిక తీర్చిన బాల‌కృష్ణ‌
X
ఒక‌రి జీవితం మ‌రొక‌రి జీవితాన్ని ఖ‌చ్చితంగా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే ఒక‌రి స‌క్సెస్ మ‌రొక‌రి సినిమాకు బంగారు బాట‌లు వేస్తుంద‌న్న‌ది నేటి సినీ జ‌నం బ‌లంగా న‌మ్ముతున్న మాట‌. ఆ మాటే ఈ రోజు అక్ష‌రాలా నిజ‌మై త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధంగా వున్న సినిమాల‌కు నూత‌న జ‌వ‌స‌త్వాల‌తో పాటు ఆ చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఊపిరులూదింది. క‌రోనా భ‌యాల‌తో భారీ చిత్రాల కోసం ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భ‌యంతో వ‌ణికిపోతున్న వేళ ఇది.

మ‌రో ప‌క్క ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టిక్కెట్ ధ‌ర‌ల్ని ఇష్టాను సారంగా పెంచుకోవ‌డానికి వీళ్లేదంటూ హుకుం జారీ చేసిన నేప‌థ్యంలో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` పేరుకు త‌గ్గ‌ట్టే అఖండ‌మైన విజ‌యాన్ని సాధించి క‌లెక్ష‌న్‌ల సునామీని సృష్టిస్తోంది. బోయపాటి శ్రీ‌ను - బాల‌య్య‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన సింహా.. లెజెండ్ చిత్రాల‌కు మించి బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజ్‌లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌లో బోయ‌పాటిశ్రీ‌ను గారు ఈ ఆడిటోరియానికే కాకుండా మొత్తం సినిమా ఇండ‌స్ట్రీకే ఓ ఊపు తెప్పించినందుకు థ్యాంక్యూ..డిసెంబ‌ర్ 2 నుంచి మొద‌లుపెట్టి అన్ని థియేట‌ర్లు కంటిన్యూస్‌గా ఫుల్‌గా ఇదే స్థాయి అరుపులు కేక‌ల‌తో ఇక్క‌డున్న మాకు ఎంత ఆనందాన్ని క‌లిగించిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న తెలుగు వాళ్ల‌కి అంతే ఆనందాన్ని క‌లిగించాల‌ని ఖ‌చ్చితంగా చెబుతున్నాను. బాల‌య్య బాబు ఒక ఆటంబాంబు.. అఖండ చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి.. మ‌ళ్లీ మా ఇండ‌స్ట్రీ ఒక కొత్త ఊపుని తీసుకురావాలి..` అని కోరుకున్నారు.

రాజ‌మౌళి కోరుకున్న‌ట్టే డిసంబ‌ర్ 2న విడుద‌లైన `అఖండ` అఖండ‌మైన విజ‌యాన్ని సాధించింది. అంతే కాకుండా ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ఇప్పుడు త‌మ చిత్రాల‌ని విడుద‌ల చేయాలా అని మీమాంస‌లోవున్న ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో భ‌రోసాని పెంచింది.

`అఖండ‌` ఇచ్చిన ఊపుతో త్వ‌ర‌లో రిలీజ్‌కు సిద్దంగా వున్న చిత్ర వ‌ర్గాల్లో స‌రికొత్త ఊపు క‌నిపిస్తోంది. పోటీ పోటీగా ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఈ నెల 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌`, 24న నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `శ్యామ్ సింఘ్ రాయ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఈ రెండు చిత్రాలూ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌వే. ఆ త‌రువాత జ‌న‌వ‌రిలో సంక్రాంతికి రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌`.. ప్ర‌భాస్ `రాధేశ్యామ్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నాయి.

ఇప్ప‌టికే వీటి ప్ర‌చారాన్ని మేక‌ర్స్ ప్రారంభించేశారు. మొత్తానికి `అఖండ‌` మైన ఊపు వ‌ల్లే మిగ‌తా చిత్రాల నిర్మాత‌లు.. ద‌ర్శ‌కులు, హీరోలు ఊపిరి పీల్చుకున్నారు. అందులోనూ మ‌రీ ముఖ్యంగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి `అఖండ‌` సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని బ‌లంగా కోరుకున్నారు. ఆయ‌న కోరిక నెర‌వేర‌డంతో రాజ‌మౌళి కూడా సూప‌ర్ స్పీడుతో త‌న `ఆర్ ఆర్ ఆర్‌` ప్రాచారాన్ని మ‌రింత స్పీడు పెంచబోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.