Begin typing your search above and press return to search.

అఖండ విజయం తో బాలయ్య ఆ సినిమాల పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   19 Dec 2021 5:46 AM GMT
అఖండ విజయం తో బాలయ్య ఆ సినిమాల పరిస్థితి ఏంటీ?
X
నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాడు. ఇప్పటికి కూడా ఆయన టాలీవుడ్‌ లో సీనియర్ స్టార్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని ఆయన కొంత కాలంగా యంగ్ స్టార్‌ హీరోలతో పోటీ పడలేక పోతున్నాడు.. వందల కోట్ల వసూళ్లను ఇతర సినిమాలు దక్కించుకుంటూ ఉంటే బాలయ్య మాత్రం వంద కోట్ల క్లబ్‌ లో చేరలేక పోయాడు అంటూ నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల కోరిక ఎట్టకేలకు తీరింది. ఆయన వంద కోట్ల ను అఖండ విజయంతో దక్కించుకున్నాడు. బోయపాటితో చేసిన మొదటి రెండు సినిమాల తరహాలోనే మూడవ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. అఖండ సినిమా భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాల పై కాస్త ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అఖండ సినిమా తర్వాత బాలయ్య చేస్తున్న.. చేయబోతున్న సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యాయి.

ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ను బాలయ్య మొదలు పెట్టాడు. ఆ సినిమా పల్నాటి పౌరుషం తో ఉంటుందని అంటున్నారు. భారీ యాక్షన్‌ సినిమా గా రూపొందబోతున్న ఆ సినిమా లో కూడా బాలయ్య ద్వి పాత్రాభినయం అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. గోపీచంద్‌ మలినేని ఈ ఏడాది ఆరంభంలో రవితేజ ను క్రాక్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమా తరహాలోనే బాలయ్య తో కూడా ఒక యదార్థ సంఘటనల ఆధారంగా కథను తయారు చేయడం జరిగిందట. ఆ కథ బాలయ్య ఇమేజ్ కు సరిగ్గా సూట్‌ అయ్యేలా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ కథ కోసం దర్శకుడు గోపీచంద్‌ మలినేని చాలా బ్యాక్ గ్రౌండ్‌ వర్క్‌.. గ్రౌండ్‌ వర్క్ చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు చెప్పుకొచ్చాడు. క్రాక్ వంటి సూపర్‌ హిట్ తర్వాత గోపీచంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కనుక పాజిటివ్ రెస్పాన్స్ ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

అఖండ సాధించిన వంద కోట్లకు పైగా వసూళ్లతో బాలయ్య తదుపరి సినిమా బిజినెస్ భారీగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అఖండ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కు కాస్త అటు ఇటుగా రెట్టింపు ఉండటం ఖాయం అనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం గోపీచంద్ మలినేని సినిమా మాత్రమే కాకుండా ఆ తర్వాత బాలయ్య చేయబోతున్న అనీల్‌ రావిపూడి సినిమా కూడా భారీ బిజినెస్ ను చేయగలదు. బాలయ్య భారీ గా బిజినెస్ అయితే చేయగలడు. కాని ఆయనతో ఈ దర్శకులు అంత వసూళ్లను రాబట్టగలరా అనేది కొందరిని తొలుస్తున్న ప్రశ్న. బాలయ్యను ఎలా చూపిస్తే అభిమానులు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. ఎలా చూపిస్తే కోట్లు కురుస్తాయి అనేది బోయపాటికి తెలుసు. మరి ఇంత ఈ ఇద్దరు దర్శకులు ఎంత వరకు బాలయ్య ను అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా చూపిస్తారు అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వీరిద్దరు కూడా బాలయ్య ను అదే రేంజ్ లో చూపించగలిగితే మరో రెండు వందల కోట్ల సినిమాలు ఆన్ ది వే... కాని అంచనాలు తప్పితే భారీ బిజినెస్ సినిమాలు కాస్త ఢీలా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.