Begin typing your search above and press return to search.

బాలయ్య 'అన్ స్టాపబుల్'.. దెబ్బకి అందరి థింకింగ్ మారిపోవాలా..!!

By:  Tupaki Desk   |   25 Oct 2021 3:30 PM GMT
బాలయ్య అన్ స్టాపబుల్.. దెబ్బకి అందరి థింకింగ్ మారిపోవాలా..!!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో ''అన్ స్టాపబుల్ విత్ NBK'' అనే టాక్ షో చేస్తున్నారు బాలయ్య. 'జోంబీ రెడ్డి' దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రోగ్రామ్ ని రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం నందమూరి అభిమానులే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రీమియర్ ప్రసారం అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆహా టీమ్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోమోలతో పోస్టర్స్ తో బాలయ్య హోస్ట్ చేస్తున్న ''అన్ స్టాపబుల్'' టాక్ షో పై అంచనాలు పెంచేస్తున్నారు. ఈరోజు సోమవారం ఈ ప్రోగ్రామ్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ''బాలయ్య బాబు షోలో సందడి చెయ్యాలా.. దెబ్బకి మన అందరి థింకింగ్ మారిపోవాలా'' అని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు.

'అందరి థింకింగ్ మారిపోవాలా' అనే లైన్ బాలయ్య కోపగ్రస్తుడు అనే అభిప్రాయాన్ని మారుస్తుందా? లేదాషో చూసే జనాల ఆలోచన మారుస్తుందా? అని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. ఏదేమైనా నందమూరి - మెగా ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఈ షో కోసం కలవడం ఆసక్తిని కలిగించిందని చెప్పవచ్చు. షో కర్టెన్-రైజర్ ఈవెంట్‌ లో బాలకృష్ణ - అల్లు అరవింద్ ఒకరిపై ఒకరు స్నేహ భావాన్ని చూపించారు. ఈ షో కోసం ఒకరు స్క్రీన్ మీద కనిపిస్తే.. మరొకరు తెర వెనుక వ్యవహారాలు చూసుకుంటున్నారు. మరి వీరిద్దరూ కలిసి చేస్తున్న 'అన్ స్టాపబుల్' ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి.

ఇకపోతే ''అన్ స్టాపబుల్'' టాక్ షో లో బాలకృష్ణ ఎలా ఉంటాడు అనే విషయం మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సూటు బూటు - కళ్ళద్దాలు ధరించి స్టైలిష్ లుక్ లో అలరించారు. వింటేజ్ బాలయ్య ని గుర్తు చేశారు. అయితే సినిమాలో భారీ డైలాగ్స్ చెప్పే నటసింహం.. బయట భిన్నంగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు టాక్ షో ని ఎలా ప్రెజెంట్ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సమాధానంగా త్వరలోనే ఎనర్జిటిక్ ప్రోమోని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు సినీ తారలు హాజరు కానున్నారు. ఇందులో ఒక ఎపిసోడ్‌ కి మెగా హీరో కూడా వస్తారని.. మొదటి ఎపిసోడ్‌ లో మాత్రం మంచు హీరోలు గెస్టులుగా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయం మీద క్లారిటీ రానుంది. ఏదేమైనా బాలకృష్ణ లాంటి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టడంతో ఈ షోపై ఇండస్ట్రీలో కూడా ఆసక్తి నెలకొందనేది అర్థం అవుతోంది.