Begin typing your search above and press return to search.
షూటింగ్ లో ఉండగా చూశారు, పెళ్లి అయ్యింది!
By: Tupaki Desk | 5 Jan 2019 9:04 PM ISTనందమూరి బాలకృష్ణ తాజాగా ‘ఎన్టీఆర్’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ‘ఎన్టీఆర్’ భారీ అంచనాల నడుమ రూపొంది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా బాలకృష్ణ చిత్రంలో నటించిన ఇతర నటీనటులతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆయన పలు విషయాలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పెళ్లి గురించి సరదాగా స్పందించిన బాలయ్య తన పెళ్లి ఎలా అయ్యిందో చెప్పుకొచ్చాడు.
‘రామ్ రహీం’ షూటింగ్ సందర్బంగా కాకినాడలో రిక్షా తొక్కే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాం. ఆ సమయంలో నన్ను ఒక మేడ మీద నుండి మా అత్తగారు చూశారట. ఆమె అయ్యో కుర్రాడు బాగున్నాడు, ఎన్టీఆర్ గారిలా ఉన్నాడు, ఎన్టీఆర్ గారి అబ్బాయి ఇలా కష్టపడుతున్నాడే అనుకుందట. అప్పుడే ఆ అబ్బాయి మన ఇంటి అల్లుడు అయితే బాగుండు కదా అనుకుందట. ఆమె అనుకోవడం, ఆ తర్వాత కొన్నాళ్లకే నేను ఆ ఇంటికి అల్లుడిని అయిపోవడం జరిగిందని బాలయ్య చెప్పుకొచ్చాడు.
‘ఎన్టీఆర్’ చిత్రంలో బాలయ్య పలు విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నాడు. తండ్రి పోషించిన కీలక పాత్రలన్నింటిని ఈ చిత్రంలో బాలయ్య చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందా అనేది చూడాలి.