Begin typing your search above and press return to search.

డ్రగ్స్ వ్యవహారం.. బాలయ్య హెల్ప్

By:  Tupaki Desk   |   29 Aug 2017 1:36 PM IST
డ్రగ్స్ వ్యవహారం.. బాలయ్య హెల్ప్
X
కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ వ్యవహారం టాలివుడ్ ని ఏ స్థాయిలో అల్లాడించిందో తెల్సిన విషయమే. అయితే ఇప్పుడిప్పుడే ఆ గాయాన్ని మరచిపోయి అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా పురిజగన్నాథ్ కు సంబందించిన వారిని సిట్ అధికారులు 12 రోజుల వరకు ముప్పుతిప్పలు పెట్టారు. కొన్ని మీడియా సంస్థలు కూడా తెలిసి తెలియని ఊహాగానాలను ప్రసారం చేసి విచారణను ఎదుర్కొన్న వారిని మనోవేదనకు గురి చేశాయనేది కూడా వాస్తవమే..

అయితే ఆ సమయంలో విచారణను ఎదుర్కొన్న కొంతమంది చాలా బాధపడ్డారు. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ అయితే మీడియాపై పోలీసులపై ఏ తరహాలో కామెంట్స్ చేశాడో తెలిసిందే. అయితే అలాంటి సమయంలో పూరికి అండగా ఉన్నారట నందమూరి బాలకృష్ణ. రీసెంట్ గా పూరి బాలయ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తను డ్రగ్స్ తీసుకున్నానని ఆరోపణలు వచ్చినప్పుడు బాలయ్య ఒక్కరే నాకూ నా ఫ్యామిలికి మోరల్ సపోర్ట్ ఇచ్చారని చెప్పాడు. అంతే కాకుండా నాకు ఎంతో ధైర్యం చెప్పారని బాలయ్య చాలా మంచి వ్యక్తని కితాబునిచ్చాడు.

ఇక ఆయన ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ క్లాసిక్ పాటలను వింటూ.. ఉంటారని చెప్పాడు. ఇక షూటింగ్స్ ఉంటే మాత్రం ఉదయాన 4 గంటలకు లేచి 6 గంటలకే సెట్స్ లో ఉంటారని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల ఎనర్జీ కంటే బాలయ్య కి 10 రేట్లు ఎక్కువగా ఎనర్జిటిక్ గా ఉంటారని చెప్పాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న పైసా వసూల్ సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.